అమరావతి: ఈనెల 7న అనంతపురం నుంచి ఉద్యమకార్యాచరణ ప్రారంభిస్తామని అమరావతి జేఏసీ ఐక్యవేదిక ప్రకటించింది. సీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దుతో పాటు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చకపోవడం వల్లే ఉద్యోగులమంతా రోడ్ల మీదకు వచ్చామని, తాము దాచుకున్న రూ.1600 కోట్లను ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినా సరైన సమాధానం లేదని అమరావతి జేఏసీ నేతలు దుయ్యబట్టారు. ఉద్యమం మొదలయ్యేలోగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని అమరావతి జేఏసీ డిమాండ్ చేసింది.