మినీ మహానాడుకు తరలిరండి

ABN , First Publish Date - 2022-07-06T04:33:53+05:30 IST

మదనపల్లెలో బుధవారం నిర్వహించే మినీమహానాడుకు తరలిరావాలని అన్నమయ్య జిల్లా టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రమే్‌షకుమార్‌రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి సూచన మేరకు గాలివీడు మండలం నుంచి వంద మందికిపైగా యువత వలంటీ ర్లుగా పనిచేసేందుకు తరలివెళ్లారు. వివరాల్లోకెళితే....

మినీ మహానాడుకు తరలిరండి
మినీ మహానాడు పోస్టర్లను ఆవిష్కరిస్తున్న రమే్‌షకుమార్‌రెడ్డి

పోస్టర్లను ఆవిష్కరించిన టీడీపీ ఇన్‌చార్జి రమే్‌షకుమార్‌రెడ్డి

లక్కిరెడ్డిపల్లె/గాలివీడు/రాయచోటిటౌన్‌/రామాపురం, జూలై5: మదనపల్లెలో బుధవారం నిర్వహించే మినీమహానాడుకు తరలిరావాలని అన్నమయ్య జిల్లా టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రమే్‌షకుమార్‌రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి సూచన మేరకు గాలివీడు మండలం నుంచి వంద మందికిపైగా యువత వలంటీ ర్లుగా పనిచేసేందుకు తరలివెళ్లారు. వివరాల్లోకెళితే.... 

 లక్కిరెడ్డిపల్లెలోని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రమే్‌షకుమార్‌రెడ్డి స్వగృహంలో కార్యకర్తలతో కలిసి మినీమహానాడు పోస్టర్లను ఆవిష్కరిం చారు. వైసీపీ అరాచక పాలన, దౌర్జన్యాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు. 2024లో చంద్రబాబునాయుడు అధికారంలోకి రావాలని ప్రతి కార్యకర్త సైనికులా పనిచేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ చైర్మెన్‌ కాలాడి ప్రభాకర్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, రాయచోటి పట్టణ అధ్యక్షుడు ఖాదర్‌వలి, మాజీ జడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, రాష్ట్ర బీసీసెల్‌ కార్యదర్శి శంకారపు జయరాం పాల్గొన్నారు.

 మినీ మహానాడుకు గాలివీడు మండల యువత వలంటీర్లుగా తరలివెళ్లారు. మండలం నుంచి వివిధ గ్రామ పంచాయతీల నుంచి వంద మందికిపైగా తరలివెళ్లారు. వివిధ కార్యక్రమాల నిర్వహణలో పాలు పంచుకోనున్నారు. 

 రాయచోటి టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేత, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు సుగవాశి ప్రసాద్‌ బాబు పోస్టర్లను ఆవిష్కరించారు. మినీ మహానాడుకు వేలాదిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మదనపల్లెలో జరగనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రామాపురం మండలం నుంచి వేలాది మందితో మినీమహానాడుకు తరలిరావాలని తెలుగు యువత మండల అధ్యక్షుడు బాలిశెట్టి రాజేష్‌ కోరారు. కార్యక్రమంలో పార్టీ యూత్‌ రమేష్‌, వెంకటేష్‌, బాలకృష్ణ, శ్రీనివాసులు, రాంమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-07-06T04:33:53+05:30 IST