త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘నాగినీ’ బ్యూటీ

బాలీవుడ్‌లో ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ మధ్యనే రాజ్ కుమార్ రావ్-పత్ర‌లేఖ, ఆదిత్య సీల్-అనుష్క రంజన్ పెళ్లి చేసుకున్నారు. వచ్చే ఏడాది ఆలియా భట్-రణ్ బీర్ కపూర్, తార సుతారియా-ఆదర్ జైన్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ జాబితాలోకి మరొకరు చేరబోతున్నారు. ఆమెవరో కాదు నాగినీ సిరీయల్ ద్వారా ప్రేక్షకులందరికి సుపరిచితురాలైన నటి మౌనీరాయ్.   


దుబాయ్‌కు చెందిన బిజినేస్‌మేన్‌ సూరజ్ నంబియార్‌ను వచ్చే ఏడాది ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇటలీ లేదా దుబాయ్‌లో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2022 జనవరి 27న వీరి వివాహం జరగబోతున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తమ రిలేషన్‌షిప్‌పై వీరిద్దరూ ఎప్పుడు కూడా స్పందించలేదు. కానీ, వారు సన్నిహితంగా మెలిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 


పెళ్లికి ముందు జరిగే సంబరాలైన మెహందీ, సంగీత్ జనవరి 26 నుంచి మొదలు కాబోతున్నట్టు మౌనీరాయ్ సన్నిహిత బంధువు తెలిపారు. పెళ్లి అనంతరం రిసెప్షన్ కూచ్ బిహార్‌లో జరగబోతుందని సమాచారం. సూరజ్ నంబియార్‌తో ఉన్న రిలేషన్ షిప్ గురించి అడగగా మౌనీరాయ్ గతంలో స్పందించింది. అవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని తను సినిమా కెరీర్‌పై మాత్రమే దృష్టి సారించానని ఆమె చెప్పడం విశేషం.

Advertisement

Bollywoodమరిన్ని...