మౌళిక సదుపాయాల లేమితో గోపాలపురం ప్రజల విలవిల

ABN , First Publish Date - 2021-04-22T06:11:43+05:30 IST

రాజమహేంద్రవరం రూ రల్‌ మండలం కాతేరు గ్రామ పరిధిలోని గోపాలపురం కాలనీ ప్రజలు కనీస సౌకర్యలు లేక అవస్థలు పడుతున్నారు.

మౌళిక సదుపాయాల లేమితో  గోపాలపురం ప్రజల విలవిల

రాజమహేంద్రవరంసిటీ, ఏప్రిల్‌ 21: రాజమహేంద్రవరం రూ రల్‌ మండలం కాతేరు గ్రామ పరిధిలోని గోపాలపురం కాలనీ ప్రజలు కనీస సౌకర్యలు లేక అవస్థలు పడుతున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు లేక కొట్టుమిట్టాడుతు న్నారు. గత 30 ఏళ్లుగా గ్రామ పంచాయతీకి ఇంటిపన్నులు కడుతున్నా గోపాలపురాన్ని పట్టించుకునే నాధుడేలేడు. డ్రైనేజీలు లేక వాడిన నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. అలాగే ిసీసీ రోడ్లులేక వర్షం పడితే ఆ ప్రాంతమంతా బురదతో చిత్తడిగా మారుతోంది. మరొక తీవ్రమైన సమస్య తాగునీటి ఎద్దడి ఇక్కడ ఏడాది పొడవునా తాగునీటి సమస్య  విలయతాండవం చేస్తోంది. పంచాయతీ తాగు నీటిని సరఫరా చేయడం లేదు. పేపరుమిల్లుకు చెందిన వాటర్‌ ట్యాంకర్‌ రెండు, మూడు రోజులకు ఒకసారి వచ్చి నీటి సరఫరా చేస్తోంది. ఇప్పుడు అది కూడా రాకపోవండంతో గోపాలపురం వాసులు వాటర్‌ క్యాన్‌లతో తాగునీటి కోసం రాజమహేంద్రవరం మునిసిపల్‌ ట్యాప్‌ల వద్దకు వెళుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు గోపాలపురాన్ని ఒక్కసారి సందర్శించి సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2021-04-22T06:11:43+05:30 IST