ఎంఓయుపై సంతకాలు చేయాలి: సినీ ఎగ్జిబిటర్ల‌పై రెవెన్యూ అధికారుల ఒత్తిడి

ABN , First Publish Date - 2022-07-02T02:26:56+05:30 IST

అమరావతి: ఎంఓయుపై సంతకాలు చేయాలని రెవెన్యూ అధికారులు రాయలసీమలో సినీ ఎగ్జిబిటర్ల‌పై ఒత్తిడి చేస్తున్నారు. జీఓ నెంబరు 69, తదనంతర చర్యలపై హైకోర్టు స్టే ఇస్తే ఇక జీఓ అమల్లో

ఎంఓయుపై సంతకాలు చేయాలి: సినీ ఎగ్జిబిటర్ల‌పై రెవెన్యూ అధికారుల ఒత్తిడి

అమరావతి: ఎంఓయుపై సంతకాలు చేయాలని రెవెన్యూ అధికారులు రాయలసీమలో సినీ ఎగ్జిబిటర్ల‌పై ఒత్తిడి చేస్తున్నారు. జీఓ నెంబరు 69, తదనంతర చర్యలపై హైకోర్టు స్టే ఇస్తే ఇక జీఓ అమల్లో లేనట్టేకదా అని వాదిస్తున్నా.. అధికారులు వినిపించుకోవడం లేదని  ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని రాయలసీమలోని కొంతమంది ఎగ్జిబిటర్లు తెలుగు ఫిలిమ్‌ ఛాంబర్‌ దృష్టికి తీసుకెళ్లారు. లిఖిత పూర్వకంగా ఇవ్వమని అధికారులను కోరాలని  ఫిలిమ్‌ ఛాంబర్‌ ఎగ్జిబిటర్లకు సూచించింది. సినీ ఎగ్జిబిటర్ల‌ను ఒత్తిడి చేస్తే కోర్టు దిక్కార పిటీషన్‌ వేస్తామని ఫిలిమ్‌ ఛాంబర్‌ నేతలు పేర్కొంటున్నారు. 


ఎంఓయూలో ఏముంది? 

"ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు మేమే అమ్ముతాం...  వచ్చిన డబ్బు మా ఖాతాకే చేరుతుంది. అందులో సేవారుసుము మినహాయించి మిగిలిన డబ్బును  మీ ఖాతాల్లో వేస్తాం. దీనికి సిని థియేటర్ల యజమానులు అంగీకరించి ఒప్పందం చేసుకోవాలి.’’ అని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  కొన్ని నియమ నిబంధనలపై ఎగ్జిబిటర్లు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఇటు రెవెన్యూ అధికారులు ఎంఒయూపై సంతకం చేయాలని సినీ ఎగ్జిబిటర్ల‌పై ఒత్తిడి చేస్తున్నారు. 

Updated Date - 2022-07-02T02:26:56+05:30 IST