Abn logo
Jul 3 2020 @ 18:49PM

మరో మొబైల్‌తో వచ్చేసిన మోటొరోలా

న్యూఢిల్లీ: మోటొరోలా తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ‘మోటొరోలా వన్ ప్యూజన్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్లస్ వెర్షన్‌ను గత నెలలో భారత్‌లో పరిచయం చేసింది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. మోటొరోలా వన్ ఫ్యూజన్ ఫీచర్ల విషయానికొస్తే 6.5 అంగుళాల మ్యాక్స్ విజన్ హెచ్‌డీ  ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ, మైక్రో ఎస్డీకార్డు ద్వారా మెమొరీని పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి.   

Advertisement
Advertisement
Advertisement