చాణక్య నీతి: డబ్బు వచ్చిందని ఈ పనులు చేస్తే జీవితం చిందరవందరే!

ABN , First Publish Date - 2022-04-10T13:18:40+05:30 IST

చాణక్య నీతి ప్రకారం సంపాదనపై ప్రతీఒక్కరికీ..

చాణక్య నీతి: డబ్బు వచ్చిందని ఈ పనులు చేస్తే జీవితం చిందరవందరే!

చాణక్య నీతి ప్రకారం సంపాదనపై ప్రతీఒక్కరికీ ఎంతో ఆశ ఉంటుంది. ఆచార్య చాణక్యుడు లక్ష్మీదేవిని సంపదకు దేవతగా అభివర్ణించాడు. జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బుకు లోటు ఉండదు. అప్పుడే జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అయితే చాలా సందర్భాల్లో డబ్బు వచ్చినప్పుడు ఆ వ్యక్తి స్వభావంలో మార్పు కనిపిస్తుంటుంది. చాణక్య నీతి ప్రకారం ఎవరైనా సరే డబ్బు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి.


కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చాణక్య నీతి ప్రకారం బలహీనులను అవమానించి, వారి హక్కులను హరించే వారు లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతారు. ఫలితంగా వారు ఇబ్బందులు పడతారు. చాణక్య నీతి ప్రకారం ఏ వ్యక్తి కూడా ఇతరుల డబ్బు కోసం ఆశపడకూడదు. జీవితంలో కష్టపడితేనే డబ్బు వస్తుంది. కష్టపడకుండా వచ్చే డబ్బు ఎక్కువ కాలం నిలవదు. అత్యాశ కలిగిన వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. చాణక్య నీతి ప్రకారం చెడు సహవాసం హాని కలిగిస్తుంది. దీని వల్ల ఎవరికీ ప్రయోజనం చేకూరదు. తెలివైన వ్యక్తి పండితులతో, వేదాలపై అవగాహన ఉన్నవారితో, మతాన్ని అనుసరించే వారితో సహవాసం చేయాలి. ఎందుకంటే చెడు అలవాట్లు కలిగినవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తించదు. అందుకే జీవితంలో విజయం కోసం, తప్పుడు వ్యక్తుల సహవాసాన్ని వెంటనే వదిలివేయాలి. చాణక్య నీతి ప్రకారం, ఏ వ్యక్తి కూడా సంపదను అవమానించకూడదు. సంపదను పొదుపు చేస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు చేయాలి. 

Updated Date - 2022-04-10T13:18:40+05:30 IST