Advertisement
Advertisement
Abn logo
Advertisement

చాణక్య నీతి: పిల్లలు విజయం సాధించాలంటే తండ్రిలో ఈ గుణాలు తప్పనిసరిగా ఉండాలి.. అప్పుడే మీకు ప్రసంశలు అందుతాయి!

తమ పిల్లలు యోగ్యులు కావాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తాడు. అయితే చాలాసార్లు సక్సెస్ కాలేకపోతాడు. అటువంటప్పుడు ఏమి చేయాలో తెలియక తల్లడిల్లిపోతాడు. నిజానికి తండ్రి బాధ్యత అనేది భూమిపై ఉన్న అతి పెద్ద బాధ్యతల్లో ఒకటని చాణక్య నీతి చెబుతోంది. ఈ బాధ్యతను నెరవేర్చడంలో ప్రతీ తండ్రి పలు సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతి తండ్రి తన సామర్థ్యానికి తగినట్టుగా పిల్లలకు చేయూతనందించేందుకు ప్రయత్నించినా.. పలు సందర్భాల్లో అతను ఊహించిన స్థాయిని అందుకోలేడు. దీనికి పరిష్కారంగా ఆచార్య ఆచాణక్య.. ఉత్తమ తండ్రిగా మారేందుకు ప్రతి తండ్రి తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

పిల్లలలో ప్రతిభను పెంపొందించండి 

ప్రతి పిల్లవానిలో ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని చాణక్య నీతి చెబుతోంది. దానిని గుర్తించి, మెరుగుపరుచుకునేలా పిల్లలకు ప్రోత్సాహాన్ని అందించాలి. మరోవిధంగా పిల్లలపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేయకూడదు. ఇది పిల్లల లేత మనస్సుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చాణక్య నీతి చెబుతోంది. 

ఇంటి వాతావరణం చక్కగా ఉండాలి 

ఇంటి వాతావరణం పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందని చాణక్య నీతి చెబుతోంది. అందుకే ఇంటి పరిసరాలు కలుషితం కాకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులు ఒకరినొకరు అర్థం చేసుకుని పిల్లలలను చక్కగా చూసుకోవాలని చాణక్య తెలిపారు. 

పిల్లలకు క్రమశిక్షణకు గల ప్రాముఖ్యతను నేర్పండి

జీవితంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని చాణక్య నీతి చెబుతుంది. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలుగుతాడు. క్రమశిక్షణ అనేది మనిషిలోని బద్దకాన్ని తరిమికొడుతుంది. నిజానికి బద్దకం అనేది మనిషి విజయానికి అడ్డంకులు సృష్టించే అతిపెద్ద శత్రువని ఆచార్య చాణక్య తెలిపారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement