మాతృభాష అమృతం... ఆంగ్లభాష అవసరం

ABN , First Publish Date - 2022-05-27T05:16:42+05:30 IST

ప్రతి విద్యార్థికి మాతృభాష అమృతమని, ఆంగ్లభాష అవసరమని రాష్ట్ర ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు.

మాతృభాష అమృతం... ఆంగ్లభాష అవసరం
ప్రసంగిస్తున్న ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతా్‌పరెడ్డి

ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతా్‌పరెడ్డి 


కడప(ఎడ్యుకేషన్‌), మే 26 : ప్రతి విద్యార్థికి మాతృభాష అమృతమని, ఆంగ్లభాష అవసరమని రాష్ట్ర ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు. కడప నగరం చిన్నచౌక్‌లోని సాయి సమావేశ మందిరంలో గురువారం రివర్సైడ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఇంగ్లీష్‌ స్కిల్స్‌పై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యాభ్యాసానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కడప జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఇంగ్లీష్‌ స్కిల్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులకు ఇంగ్లీష్‌ అనర్గళంగా మాట్లాడటం, ఇంగ్లీ్‌షలో చక్కని ప్రొనౌన్షియేషన్‌తో అనర్గళంగా మాట్లాడ గలిగి ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆర్జేడీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంగ్లం ప్రాముఖ్యత ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు తెలియజేసి... ఆంగ్ల మాధ్యమంలో బోధన నిర్వహించాలన్నారు. మాతృభాషను తప్పనిసరిగా చేస్తూ బోధనాభ్యాసన ప్రక్రియ జరగాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సి.దేవరాజు, ఎంఈవో పాలెం నారాయణ, ఆర్‌ఎల్‌సీ రిసోర్స్‌  పర్సన్లు అర్చన, భవిత, ఎస్‌సీఈఆర్‌టీ రిసోర్స్‌ పర్సన్లు భానుమతి, పద్మావతి, శైలజ, పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-27T05:16:42+05:30 IST