Shocking: ఇరవై రోజుల క్రితం జన్మించిన కవల పిల్లలు మాయం.. విచారణలో బయటపడిన షాకింగ్ విషయాలు..!

ABN , First Publish Date - 2022-09-28T00:18:02+05:30 IST

వారిద్దరికీ ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఈ నెల 7వ తేదీన వారికి కవల పిల్లలు జన్మించారు..

Shocking: ఇరవై రోజుల క్రితం జన్మించిన కవల పిల్లలు మాయం.. విచారణలో బయటపడిన షాకింగ్ విషయాలు..!

వారిద్దరికీ ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఈ నెల 7వ తేదీన వారికి కవల పిల్లలు జన్మించారు.. ఇద్దరూ మగపిల్లలే కావడంతో బంధుమిత్రులు సంతోషపడ్డారు.. అయితే ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు.. ఈ నెల 23 నుంచి వారిద్దరూ కనిపించలేదు.. ఊరికి వెళ్తుండగా ఎవరో పిల్లలను దొంగిలించారని తల్లి చెప్పింది.. ఆ మహిళ తీరు వింతగా అనిపించడంతో పోలీసుల తమదైన శైలిలో విచారించారు.. దీంతో ఆ మహిళ అసలు నిజం చెప్పేసింది.. ఆ పిల్లలను గొంతు నులిమి చంపేసినట్టు అంగీకరించింది. 


ఇది కూడా చదవండి..

కదులుతున్న బైక్ నుంచి దూకేసిన 16 ఏళ్ల బాలిక.. హాస్పిటల్‌కు తరలించిన స్థానికులు.. ఆమె చెప్పింది విని షాకైన పోలీసులు..


మధ్యప్రదేశ్‌లోని బెరాసియాకు చెందిన సప్నా ధాకడ్ (27)కు, 2017లో బ్రిజ్ మోహన్ ధాకడ్ (28)తో వివాహం జరిగింది. సప్నా మూడేళ్ల క్రితం ఓ అడ పిల్లకు జన్మనిచ్చింది. తాజాగా సెప్టెంబర్ 7న కవలలకు జన్మనిచ్చింది. సెప్టెంబరు 23న తెల్లవారుజామున 4.30 గంటలకు కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో సప్న పిల్లలిద్దరితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త నిద్ర లేచి చూసేసరికి ఇంట్లో పిల్లలు, భార్య కనిపించలేదు. ఫోన్ చేసి భార్యను అడగ్గా ఆమె చెప్పలేదు. ఆమె గురించి వెతగ్గా చివరకు రంగమహల్‌ దగ్గర్లో కనిపించింది. అయితే అప్పటికి ఆమె చేతిలో పిల్లలు లేరు. పిల్లలు ఏరి అని భర్త అడిగితే.. ఎవరో దొంగలించారని చెప్పింది. దీంతో భార్యాభర్తలిద్దరూ టీటీనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. 


విచారణ ప్రారంభించిన పోలీసులకు సప్న తీరు అనుమానం కలిగించింది. నాలుగు రోజుల పాటు ఆమె రకరకాల కథలు వినిపించింది. దీంతో పోలీసులు ఆమెపై అనుమానం పెంచుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమె అసలు నిజం అంగీకరించింది. తన పిల్లలిద్దరిని గొంతు నులిమి చంపేసి కాలువలో పడేశానని చెప్పింది. అప్పటికే తనకు ఓ ఆడ పిల్ల ఉందని, ఇప్పుడు ఈ ఇద్దరు మగ పిల్లలను చూసుకోవడం కష్టమవుతోందని, పిల్లలను సరిగ్గా చూసుకోకపోతే అత్తమామలు తనను తిడుతున్నారని, అందుకే పిల్లలిద్దరినీ చంపేశానని పోలీసులకు చెప్పింది. పోలీసులు సప్నను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  

Updated Date - 2022-09-28T00:18:02+05:30 IST