15వేలకు పసిబిడ్డను అమ్మిన తల్లి

ABN , First Publish Date - 2020-10-29T18:10:12+05:30 IST

అయితే బిడ్డను అమ్మినట్లు వచ్చిన ఆరోపణలను తల్లి ఖండించింది. తనకు పెంచే సామర్థ్యం లేనందున ఆసక్తిగా ఉన్న దంపతులకు దత్తతగా ఇచ్చానని చెప్పుకొచ్చింది. తన భర్త తనను విడిచి పెట్టాడని, కూలీ పని చేసి బిడ్డను పెంచే స్థోమత తనకు లేనందున

15వేలకు పసిబిడ్డను అమ్మిన తల్లి

భుబనేశ్వర్: పేదరికంలో ఉన్న ఓ తల్లి, తన నెల రోజుల పసికందును 15 వేల రూపాయలకు అమ్ముకుంది. అయితే ఈ విషయం చైల్డ్‌లైన్ బయట పెట్టడంతో బిడ్డను అమ్ముకున్న తల్లితో సహా మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒడిశాలోని చర్మల్ జిల్లాలో జరిగిందీ దారుణం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ మహిళ తన కవల పిల్లలను అమ్ముకున్నట్లు, ఆ తర్వాత ఇన్నేళ్లకు మరో తల్లి తన బిడ్డను అమ్ముకుందని పేర్కొన్నారు.


అయితే బిడ్డను అమ్మినట్లు వచ్చిన ఆరోపణలను తల్లి ఖండించింది. తనకు పెంచే సామర్థ్యం లేనందున ఆసక్తిగా ఉన్న దంపతులకు దత్తతగా ఇచ్చానని చెప్పుకొచ్చింది. తన భర్త తనను విడిచి పెట్టాడని, కూలీ పని చేసి బిడ్డను పెంచే స్థోమత తనకు లేనందున.. తన బిడ్డను దత్తత ఇచ్చానని తెలిపింది. అలాగే బిడ్డను తీసుకున్న దంపతులు కూడా దీనిని ఖండించారు. తాము ఎవరినీ కొనలేదని, తల్లి అనుమతితోనే పెంచుకునేందుకు దత్తత తీసుకున్నామని అన్నారు.

Updated Date - 2020-10-29T18:10:12+05:30 IST