పునర్జన్మలకు మరో సాక్ష్యం: చనిపోయిన తేదీలు సైతం చెప్పిన బాలుడు... ఆశ్చర్యపోయిన తల్లి

ABN , First Publish Date - 2021-10-02T16:33:14+05:30 IST

పునర్జన్మలకు సంబంధించిన అనేక కథలు మనకు...

పునర్జన్మలకు మరో సాక్ష్యం: చనిపోయిన తేదీలు సైతం చెప్పిన బాలుడు... ఆశ్చర్యపోయిన తల్లి

పునర్జన్మలకు సంబంధించిన అనేక కథలు మనకు వినిపిస్తుంటాయి. పలు సినిమాల్లోనూ, సీరియళ్లలోనూ కూడా కనిపిస్తుంటాయి. పునర్జన్మలపై హిందువులలో అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి. పైగా కొందరు తమ గతజన్మ జ్ఞాపకాలను చెబుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఇటువంటి విచిత్ర ఉదంతం వైరల్‌గా మారింది..... తన కుమారుడు అతని గత జన్మకు సంబంధించిన అన్ని వివరాలు చెబుతున్నాడని ఒక మహిళ వెల్లడించింది. తన కుమారుడు గత జన్మలో తాను రోడ్డు ప్రమాదంలో చనిపోయానని చెబుతున్నాడని  పేర్కొంది. 


టిక్‌టాక్‌లో అనా అనే మహిళకు @ana_mana_pia పేరుతో అకౌంట్ ఉంది. దానిలో ఆమె తన కుమారునితో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆ మహిళతో పాటు ఆమె కుమారుడు కారు లోపల కూర్చుని మాట్లాడుకోవడం కనిపిస్తుంది. 10 నిముషాల పాటు ఉన్నఈ వీడియోలో ఆ బాలుడు తన గత జన్మకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాడు. తన గత జన్మలో తాను ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు తెలిపాడు. ఆ సమయంలో తాను చిన్నపిల్లవాడినని పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన తేదీ, ఎక్కడి జరిగిందనే వివరాలు కూడా స్పష్టంగా వివరించాడు. ఈ మాటలు వినగానే ఆమె ఆశ్చర్యపోయింది. తన కుమారుడు అతనికి ఎదురైన అనుభవాన్ని కళ్లకు కట్టినట్లు చెబుతున్నాడని పేర్కొంది. కాగా ఈ వీడియోను ఇప్పటివరకూ 20 లక్షలకుపైగా వీక్షణలు దక్కాయి. దీంతో మరికొందరు  తమకు ఎదురైన ఇటువంటి అనుభవాలను షేర్ చేస్తున్నారు.

Updated Date - 2021-10-02T16:33:14+05:30 IST