Abn logo
Sep 21 2021 @ 08:55AM

తల్లిని హతమార్చిన తనయుడి అరెస్టు

చెన్నై: తాగుడు మానాలని సలహా ఇచ్చిన తల్లిని హత్యచేసిన తనయుడిని పోలీసులు అరెస్టు చేశారు. వేళచ్చేరి నెహ్రూనగర్‌ తిరువికా వీధిలో రామలింగం, లక్ష్మి(47) దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమారుడు మూర్తి ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చి తల్లి దండ్రులతొ గొడవ పడుతుండేవాడు. ఆదివారం రాత్రి తాగిన మైకంలో ఇంటికి చేరిన మూర్తిని తల్లి తీవ్రంగా మందలించింది. దీంతో ఆగ్రహించిన మూర్తి వేట కొడ వళితో లక్ష్మిపై దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పో యింది. వేళచ్చేరి పోలీసులు మూర్తిని అరెస్టు చేశారు.