Abn logo
Oct 20 2021 @ 09:23AM

తల్లిపై దాడి చేసిన అన్నను చంపిన తమ్ముడు

అడయార్‌(chennai): అల్పాహారం చేయని తల్లిపై దాడి చేశాడన్న కారణంతో అన్నపై దాడి చేసి అతనిని హత్య చేసిన తమ్ముడిని నగర పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక విల్లివాక్కం, బలరామపురంలో ఈ ఘటన జరిగింది. ఈ విధికి చెందిన శివరాజ్‌(46) అనే వ్యక్తికి ధనలక్ష్మి(67) అనే తల్లి, ప్రకాష్‌(44) అనే తమ్ముడు ఉన్నాడు. శివరాజ్‌ స్థానిక ఐసీఎఫ్‌లో పనిచేస్తూ వీఆర్‌ఎస్‌ తీసుకుని అవివాహితుడుగానే ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తల్లి వద్ద టిఫన్‌ ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. ఆమె ఏదో కారణం చెప్పడంతో ఆగ్రహించిన ఆమెపై చేయిచేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తమ్ముడు ప్రకాష్‌ ఆగ్రహంతో అన్న శివరాజ్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో తలకు బలమైన గాయం తగలడంతో అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రకాష్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...