కరోనా సోకిందని తల్లిని ఇంట్లోకి రానివ్వని కొడుకులు

ABN , First Publish Date - 2020-05-29T21:14:13+05:30 IST

చెట్టుకు కాయ బరువా.. తల్లికి బిడ్డ బరువా అంటుంటారు.. అయితే తల్లికి బిడ్డ బరువు కాకపోయినా ఆ బిడ్డలకు మాత్రం తల్లి బరువైపోయింది. కరోనా మహమ్మారి సాకుతో తల్లిని వదిలించుకోవాలని అనుకున్నారు ప్రబుద్ధులు.

కరోనా సోకిందని తల్లిని ఇంట్లోకి రానివ్వని కొడుకులు

కరీంనగర్: చెట్టుకు కాయ బరువా.. తల్లికి బిడ్డ బరువా అంటుంటారు.. అయితే తల్లికి బిడ్డ బరువు కాకపోయినా ఆ బిడ్డలకు మాత్రం తల్లి బరువైపోయింది. కరోనా మహమ్మారి సాకుతో తల్లిని వదిలించుకోవాలని అనుకున్నారు ప్రబుద్ధులు. భుజాన ఎత్తుకుని గోరుముద్దలు తినిపించి.. గుండెలకు హత్తుకుని ముద్దులు కురిపించిన ఆ తల్లిని ఎర్రటి ఎండలో నిలబెట్టారు. ఇరుపొరుగు వారు చీదరించుకున్నా ఆ కొడుకులు కనికరించలేదు. ఓ ప్రజా ప్రతినిధి జోక్యంతో ఎట్టకేలకు ఆ తల్లిని ఇంట్లోకి తీసుకెళ్లాడు పెద్ద కొడుకు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. కరీంనగర్ లోని కిసాన్‌నగర్‌లో షోలాపూర్ నుంచి కొడుకుల ఇంటికి  తల్లి వచ్చింది. తల్లికి కరోనా సోకిందని కొడుకులు ఇంట్లోకి రానివ్వలేదు. కొడుకులు ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఆ తల్లి శ్యామల ఎండలో రోడ్డు పైనే కూర్చొంది. స్థానిక కార్పొరేటర్ అశోక్ జోక్యం చేసుకోవడంతో పెద్ద కొడుకు ఇంట్లోకి తల్లి వెళ్లింది.

Updated Date - 2020-05-29T21:14:13+05:30 IST