మాకు అమ్మ వద్దు.. తల్లి అకృత్యాలను పోలీసులకు చెప్పిన బాలికలు.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-16T18:13:01+05:30 IST

`మాకు అమ్మతో కలిసి ఉండడం ఇష్టం లేదు. ఆమె మమ్మల్ని చాలా కష్టాలు పెడుతోంది.

మాకు అమ్మ వద్దు.. తల్లి అకృత్యాలను పోలీసులకు చెప్పిన బాలికలు.. చివరకు..

`మాకు అమ్మతో కలిసి ఉండడం ఇష్టం లేదు. ఆమె మమ్మల్ని చాలా కష్టాలు పెడుతోంది. ఆహారం ఇవ్వడం లేదు. తరచుగా కొడుతోంది. మొహం మీద వేడి నూనె పోసింది. మేం మా నాన్న, నాన్నమ్మ దగ్గరకు వెళ్లిపోతాం. తల్లితో ఉండం`.. కన్నతల్లి వేధింపులకు గురవుతున్న ఇద్దరు చిన్నారుల బాధ ఇది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఖజ్రానా ప్రాంతానికి చెందిన భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆరు నెలల క్రితం విడిపోయారు. 


అప్పటి నుంచి వారి ఇద్దరు కూతుళ్లు తల్లి వద్దే ఉంటున్నారు. ఆ మహిళ తన తల్లి ఇంటికి సమీపంలో అద్దె ఇంట్లో జీవిస్తోంది. ఆడపిల్లలను పాఠశాలకు పంపడం లేదు. భర్తపై కోపంతో పిల్లలిద్దరినీ వేధింపులకు గురి చేస్తోంది. దీంతో వారు తెలిసిన వారి సహాయంతో తమ తల్లి అకృత్యాలపై చైల్డ్ లైన్‌కు సమాచారం అందించారు. దీంతో చైల్డ్ లైన్ కౌన్సెలర్లు ఖజ్రానా పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడేళ్ల పాప మొహంపై నూనె పడి కాలిపోయిన గుర్తులు వారికి కనిపించాయి. ఆ గాయాల గురించి అడిగితే తల్లి సరైన సమాధానాలు చెప్పలేకపోయింది. 


తల్లిని, ఇద్దరూ కూతుళ్లను చైల్డ్ లైన్ ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ బాలికల తండ్రి, నాయనమ్మను స్టేషన్‌కు పలిపించారు. అక్కడ తండ్రిని పట్టుకుని బాలికలిద్దరూ విలపించారు. కౌన్సిలింగ్ అనంతరం ఆ బాలికలను తండ్రి, నాయనమ్మకు పోలీసులు అప్పగించారు. తల్లిపై చర్యలు తీసుకోవద్దని బాలికలు కోరడంతో ఆమెను వదిలేశారు. 


Updated Date - 2022-04-16T18:13:01+05:30 IST