Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైరస్‌లపై పోరులో తల్లిపాలే ఉత్తమం!

తాజా అధ్యయనంలో వెల్లడి 

న్యూయార్క్‌, ఏప్రిల్‌20: కరోనా విజృంభిస్తున్న వేళ నవజాత శిశువులకు తల్లిపాలు ఇవ్వడమే మంచిదట! తప్పనిసరిగా తల్లిపాలే ఇవ్వాలని కూడా అంతర్జాతీయ సంస్థలు సిఫారసు చేస్తున్నాయి. శిశువులకు వైరస్‌ కారక వ్యాధులు సోకకుండా తల్లి పాలు సమర్థంగా అడ్డుకుంటాయని తాజా అధ్యయనం వెల్లడించింది. తల్లి నుంచి నేరుగా యాంటీబాడీస్‌ శిశువుకు అందుతాయి కాబట్టి రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ సోకుతున్న నేపథ్యంలో నవజాత శిశువులకు తల్లిపాలు ఇవ్వడమే ఉత్తమమని స్పష్టం చేస్తున్నారు. తల్లుల పాల ద్వారా శిశువులకు వైరస్‌ సోకుతుందా? లేదా?అన్న విషయం తెలియదని, తల్లి పాలలో వైరస్‌ను గుర్తించలేదని అధ్యయనకర్త డియాన్‌లిన్‌ స్పాజ్‌ వెల్లడించారు

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...