Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 08 May 2022 12:36:48 IST

MODI నుంచి YOGI దాకా.... ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే

twitter-iconwatsapp-iconfb-icon
MODI నుంచి YOGI దాకా.... ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే

న్యూఢిల్లీ: ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అనే సామెత చాలా కాలంగా వాడుకలో ఉంది. ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగినా అమ్మ ఆశీస్సుల కోసం అంతా తపిస్తుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (narendra modi) నుంచి యోగి ఆదిత్యనాథ్ (yogi adithyanath) దాకా అందరూ ఈ కోవలోనివారే. సీఎంగా, పీఎంగా ఎంత బిజీగా ఉన్నా ఛాన్స్ దొరికితే చాలు గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చేరుకుంటారు నరేంద్ర మోదీ. అమ్మ హీరాబెన్ ఒడిలో సేదతీరుతారు. అమ్మ చేతి గోరుముద్దలు తింటారు. అమ్మ సంతోషం కోసం ఆమె పొదుపు చేసి ఇచ్చే కొద్దిపాటి డబ్బులు తీసుకుంటుంటారు. ఏ విజయం సాధించినా కూడా తల్లి ఆశీస్సులు తీసుకుంటే తప్ప మోదీకి ఏమీ తోచదు. తమను పెంచి పెద్ద చేసేందుకు తండ్రి చాయ్ అమ్ముతుంటే తల్లి హీరాబెన్ మోదీ (heeraben modi)  పొరుగిళ్లలో బట్టలుతకడం, గిన్నెలు తోమడం, ఇళ్లు తుడవడం చేస్తుండేవారని మోదీ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మనం ఎలా మరవగలం?  


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) ఇప్పటికీ అమ్మచాటు కొడుకే. సంతోషమైనా, దు:ఖమైనా తల్లి సోనియా గాంధీ (sonia gandhi)తో పంచుకోవాల్సిందే. ఇంట్లోనే కాదు పార్లమెంట్‌లోనూ అమ్మ సోనియా మార్గదర్శనమే రాహుల్ కోరుకుంటారు. 

తనపై తల్లి లిల్లీ థరూర్ (lilly tharoor) ప్రభావం చాలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) చెబుతుంటారు. తాను రాసిన పుస్తకాల్లో కూడా తన తల్లి గురించి ప్రశంసలు కురిపిస్తుంటారు. స్త్రీ వాదాన్ని అర్ధం చేసుకోవడానికి, స్వతంత్ర ఆలోచన కలిగి ఉండటానికి తల్లి లిల్లీ ప్రభావమే కారణమంటారు. రాష్ట్రీయ జనతాదళ్ యువ నేత tejashwi yadavపై ఆయన తండ్రి Lalu Prasad Yadav కన్నా తల్లి rabri devi ప్రభావమే ఎక్కువ. దాణాస్కామ్‌ కేసులో లాలూ జైలు జీవితం గడుపుతున్నా ధైర్యం కోల్పోకుండా నిలబడ్డారామె. అంతేకాదు బీహార్ మాజీ సీఎంగా కూడా రబ్రీదేవి... తేజస్వికి కీలక విషయాల్లో సలహాలు ఇస్తుంటారు!  

  aam aadmi party అధినేత, ఢిల్లీ సీఎం Arvind Kejriwalపై ఆయన తల్లి Gita Deviకి నమ్మకం ఎక్కువ. పాఠశాల రోజుల్లోనే కేజ్రీవాల్ తెలివైన విద్యార్ధిగా ఉండేవాడని, స్కూళ్ల నుంచి ఎటువంటి ఫిర్యాదులూ వచ్చేవి కావని ఆమె తరచూ చెబుతూ ఉంటారు. సామాన్యుల హృదయాలు గెలవడం కేజ్రీవాల్‌కు చిన్నప్పటినుంచే అలవడిందని గీతాదేవి అంటుంటారు.  యూపీ సీఎం yogi adityanath దాదాపు ఐదేళ్ల తర్వాత తన తల్లి Savitri Deviని ఇటీవలే కలుసుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామం పంచూర్ వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. సన్యాసం స్వీకరించి gorakhnath math పీఠాన్ని అధిష్టించిన యోగి చాలా కాలం క్రితమే తల్లిదండ్రులకు దూరమయ్యారు. కాషాయం ధరించినా రాజకీయ క్షేత్రంలో ఉంటూ యోగి యూపీలో రాజకీయాలను పూర్తిగా ప్రభావితం చేశారు. ప్రజా హృదయాలను గెలుచుకుని వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించారు. అయినా తల్లి ఆశీస్సులుంటేనే మున్ముందు మరిన్ని విజయాలు సాధించగలమని యోగి నమ్ముతుంటారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.