తల్లీకూతుళ్ల సజీవదహనం

ABN , First Publish Date - 2022-07-03T06:52:04+05:30 IST

జగ్గంపేటలో శనివారం సాయంత్రం రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు పోరు సభ విజయవంతమైంది.

తల్లీకూతుళ్ల సజీవదహనం

పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఇద్దరు?
అల్లవరం, జూలై 2: కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన జరిగింది. వ్యవసాయ కూలీ సాధనాల లింగన్న భార్య మంగాదేవి (42), డిగ్రీ చదువుతున్న వారి చిన్న కుమార్తె మేడిశెట్టి జ్యోతి(22) అనుమానాస్పద స్థితిలో మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ సంఘటనతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. మృతదేహాలు ముద్దల్లా మిగిలాయి. వివరాలు ఇలా ఉన్నాయి...జ్యోతి కొమ రగిరిపట్నం శివారు దైవాలలేనికి చెందిన ఆటో డ్రైవర్‌ మేడిశెట్టి సురేష్‌ (ఆటోపండు)ను ఫిబ్రవరి 10న కుటుంబ సభ్యులకు ఇష్టం లేక పోయినా ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె గర్భిణి. వారం క్రితం సురేష్‌ జ్యోతిని పుట్టింటి వద్ద వదిలాడు. తన మేనకోడలైన చినపాపతో శుక్రవారం రాత్రి అత్త వారింటికి తీసుకువచ్చి తిరిగి వెళ్లిపోయాడు. లింగన్న పక్క గదిలో పడు కుని ఉండగా తల్లీకూతుళ్లు మంగాదేవి, గర్భిణి అయిన జ్యోతి వేరే గదిలో పడు కున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం తెల ్లవారుజామున 2.30 గంటల సమయంలో జ్యోతి, మం గాదేవి ఉన్న ఇల్లు అగ్నిప్రమాదంలో కాలి పోతుండగా మెలకువ వచ్చిందని భర్త లింగన్న తెలిపాడు. పక్క ఇంట్లో ఉంటున్న అతని బావ మరిది తిరుమనాథం దుర్గారావు ఘటన వివరాలను అధికారులకు వివ రించారు. మం గాదేవి, జ్యోతి పూర్తిగా కాలిపోగా లింగన్న ప్రాణాలతో బయట పడ్డాడు. అగ్నిమాపక సిబ్బంది మం టలను ఆర్పి వేశారు. ఆ సమయంలో ఆ ఇంట్లో ముగ్గురే ఉన్నారు. ఒక మహిళ, ఒక యువకుడు మాస్కులు, గ్లౌజులు ధరించి అగ్నిప్రమాద సమయంలో అక్కడి నుంచి అమ్మవారి గుడి రోడ్డుకు వెళు తుండగా చూశామని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.ఇదిలా ఉండగా సురేష్‌కు గతంలో ఒక యువతితో వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీ సుల దర్యాప్తులో తేలింది. ఆ ఇద్దరే వీరిని హత్యచేసి, పెట్రోల్‌ పోసి అంటించారన్న అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద స్థలికి కేవలం పది మీటర్ల దూరంలో పేపరు చుట్టి ఒక చాకు పడి ఉండగా దాన్ని పోలీసులు సేకరించారు. ముందుగానే పథకం ప్రకారం తల్లీకూతుళ్లను ఎవరైనా హత్యచేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించి హంతకులు గొళ్లెం పెట్టి వెళ్లిపోయి ఉంటారన్న దిశలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి, రూరల్‌ సీఐ వీరబాబు, అల్లవరం, ఉప్పలగుప్తం, అంబాజీపేట, అమలాపురం తా లూకా ఎస్‌ఐలు  బి.ప్రభాకరరావు, వెంకటేశ్వరరావు, చైతన్యకుమార్‌, పరదేశి శనివారం సంఘటనా స్థలంలో ప్రమాద కారణాలకు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా తల్లీకూతుళ్ల సజీవ దహనం కేసు దర్యాప్తు లో భాగంగా అల్లుడు మేడిశెట్టి సురేష్‌ను, కొమరగిరిపట్నం సుం కరవారి వీధికి చెందిన సురేష్‌ మాజీ ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచా రిస్తున్నట్టు సమాచారం. ఈ సం దర్భంగా వారు నేరానికి సంబంధించి పలు వివరాలను వెల్లడించినట్లు తెలిసింది. తహశీల్దార్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రసాద్‌, ఎంపీడీవో జీవీ సరోవరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రమాద స్థలిలో ఆధారాలు సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించగా ప్రమాద స్థలి నుంచి మహాలక్ష్మమ్మ గుడి వరకు వెళ్లి ఆగిపోయింది. తల్లీకూతుళ్ల సజీవ దహనం బాధాకరమని, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ చెప్పారు. ఆయన జాయింట్‌ కలెక్టర్‌ ధ్యానచంద్రతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని మంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు. తల్లీకూతుళ్ల మృతదేహాలకు అల్లవరం సామాజిక ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు.

Updated Date - 2022-07-03T06:52:04+05:30 IST