అమూల్‌, మదర్‌ డెయిరీ పాలు ప్రియం

ABN , First Publish Date - 2022-08-17T06:58:44+05:30 IST

ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థలు అమూల్‌, మదర్‌ డెయిరీలు పాల ధరను పెంచాయి. లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ పెంపు

అమూల్‌, మదర్‌ డెయిరీ పాలు ప్రియం

లీటరుకు 2 రూపాయల పెంపు

పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి


న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థలు అమూల్‌, మదర్‌ డెయిరీలు పాల ధరను పెంచాయి. లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ పెంపు బుధవారం నుంచే అమల్లోకి రానున్నట్లు ప్రకటించాయి. పెట్టుబడులు పెరగడంతోనే అమూల్‌ పాల ధరను పెంచినట్లు గుజరాత్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అమూల్‌, మదర్‌ డెయిరీలు పాల ధరలను పెంచడం గడిచిన ఆర్నెల్లలో ఇది రెండో సారి కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చి ప్రారంభంలో కూడా పాల ధరను లీటరుకు రూ.2 చొప్పున పెంచాయి. తాజాగా పెంచిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని జీసీఎంఎంఎఫ్‌ తెలిపింది. గడిచిన ఐదు నెలల్లో పెట్టుబడి వ్యయం భారీగా పెరిగిపోయిందని, ఫలితంగానే పాల ధరలు పెంచాల్సి వచ్చిందని మదర్‌ డెయిరీ వెల్లడించింది. 

Updated Date - 2022-08-17T06:58:44+05:30 IST