ఆసుపత్రిలో ఉన్న తల్లి ఫోన్‌కు వచ్చిందో మెసేజ్.. కంగారుగా ఇంటికి ఫోన్.. చివరకు జరిగిన ఘోరమిది..!

ABN , First Publish Date - 2021-07-31T23:43:52+05:30 IST

ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్న తల్లికి ఒక మెసేజ్ వచ్చింది. అది చూసి ఆశ్చర్యపోయిన ఆమె.. కంగారుగా ఇంటికి ఫోన్ చేసింది. ఎందుకంటే ఆమె ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు ఆ మెసేజ్ చెప్తోంది.

ఆసుపత్రిలో ఉన్న తల్లి ఫోన్‌కు వచ్చిందో మెసేజ్.. కంగారుగా ఇంటికి ఫోన్.. చివరకు జరిగిన ఘోరమిది..!

ఇంటర్నెట్ డెస్క్: ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్న తల్లికి ఒక మెసేజ్ వచ్చింది. అది చూసి ఆశ్చర్యపోయిన ఆమె.. కంగారుగా ఇంటికి ఫోన్ చేసింది. ఎందుకంటే ఆమె ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు ఆ మెసేజ్ చెప్తోంది. దీంతో ఆ డబ్బు ఎందుకు కట్ అయిందంటూ ఇంటికి ఫోన్ చేసి పిల్లలను అడిగింది. దీనికి ఆమె 13 ఏళ్ల కొడుకు బదులిచ్చాడు. తాను ఆడుకునే ఆన్‌లైన్ గేమ్‌లో అవసరం అయితే ఆ డబ్బు తీసుకున్నానని చెప్పాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఆమె.. కొడుకును చెడామడా తిట్టేసింది. దీంతో ఆ కొడుకు చాలా హర్ట్ అయ్యాడు. ఫోన్ పెట్టేసిన వెంటనే తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. కాసేపటికి తమ్ముడి కోసం వచ్చి గది తలుపులు కొట్టిన అక్కకు ఎటువంటి సమాధానమూ రాలేదు. దీంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అంతే హడావుడిగా ఇంటికొచ్చిన తల్లిదండ్రులు బాలుడి గది తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్న అబ్బాయి కనిపించాడు. అంతే ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.


వివేక్ పాండే, ప్రీతీ పాండే జంటకు ఇద్దరు పిల్లలు. వివేక్ పైథాలజీ విభాగం డైరెక్టర్‌ కాగా, జిల్లా ఆస్పత్రిలో ప్రీతి పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆ తల్లి ఆస్పత్రిలో ఉండగా ఆమె ఖాతా నుంచి 1500 రూపాయలు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇంటికి ఫోన్ చేసి అడిగితే తాను ‘ఫ్రీ ఫైర్’ గేమ్ ఆడుతూ ఈ డబ్బు కట్టానని ఆమె కుమారుడు కృష్ణ (13) చెప్పాడు. 6వ తరగతి చదువుతున్న ఆ బాలుడు అప్పటికే ఈ గేమ్‌కు బానిసయ్యాడు. ఇలా అప్పటికే చాలాసార్లు డబ్బులు కట్ అవడంతో ఆ తల్లి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొడుకును బాగా తిట్టేసింది. దీంతో మనస్థాపానికి గురైన కృష్ణ.. తన గదిలోకి వెళ్లి ఒక సూసైడ్ నోట్ రాసిపెట్టి, ఆత్మహత్య చేసుకున్నాడు. తాను అప్పటికే ఫ్రీ ఫైర్ గేమ్‌ కోసం రూ.40వేలు ఖర్చు పెట్టినట్లు తన సూసైడ్ నోట్‌లో రాసిన కృష్ణ.. తల్లిదండ్రులకు సారీ చెప్తూ, తల్లిని బాధపడొద్దని కోరుకున్నాడు. చిన్న వయసులోనే కృష్ణ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Updated Date - 2021-07-31T23:43:52+05:30 IST