తన తప్పు కూతురికి తెలిసిందని చంపేసింది... అసలు విషయం తెలియక భార్యకే సాయం చేసిన భర్త

ABN , First Publish Date - 2021-09-29T06:47:41+05:30 IST

కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్ జిల్లాలో ఓ 28 మహిళ హత్య కేసులో పోలీసలు ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ ముగ్గురిలో మృతురాలి తల్లిదండ్రులు, పెదనాన్న ఉన్నారు. చిక్‌బల్లాపూర్ జిల్లా పోలీసల కథనం ప్రకారం పర్వీనా(28)ని తన తల్లి గుల్జార్ బాను(45), పెదనాన్నప్యారెజాన్(60) కలిసి చంపేశారు...

తన తప్పు కూతురికి తెలిసిందని చంపేసింది... అసలు విషయం తెలియక భార్యకే సాయం చేసిన భర్త

కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్ జిల్లాలో ఓ 28 ఏళ్ల మహిళ హత్య కేసులో పోలీసలు ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ ముగ్గురిలో మృతురాలి తల్లిదండ్రులు, పెదనాన్న ఉన్నారు.  చిక్‌బల్లాపూర్ జిల్లా పోలీసల కథనం ప్రకారం పర్వీనా(28)ని తన తల్లి గుల్జార్ బాను(45), పెదనాన్నప్యారెజాన్(60) కలిసి చంపేశారు, ఆ సమయంలో అక్కడకి వచ్చిన పర్వీనా తండ్రి ఫయాజ్(50) హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు వారికి సహకరించాడు. ఫయాజ్ మూగవాడు, పర్వీనా అతని పెద్దకూతురు.


పర్వీనా ఒక హిందువును పెళ్లిచేసుకోవడం ఇష్టంలేకే తల్లిదండ్రలు చంపేశారని, ఇది ఒక పరువు హత్య అని పోలీసులు భావించారు. వివరాల ప్రకారం పర్వీనా శవం ఒక బావిలో దొరికింది. కానీ పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ఆమెను ఎవరో గొంతు నులిమి ప్రాణం పోయాక, బావిలో పారవేశారని తెలిసింది. పర్వీనా కాల్ డేటా ప్రకారం ఆమె చివరగా తన తల్లి, పెద్దనాన్నతో తరుచూ మాట్లాడేది అని, చివరగా చనిపోయేముందు వారిద్దరితోనే మాట్లాడిందని తెలిసింది.


పర్వీనా కుటుంబసభ్యలను పోలీసులు గట్టిగా విచారణచేయగా, నిజం బయటకొచ్చింది. నిజానికి పర్వీనా తల్లి  గుల్జార్ బానుకి, పెదనాన్నప్యారెజాన్‌తో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం పర్వీనాకు తెలిసిపోవడంతో  గుల్జార్ బాను, ప్యారెజాన్ ఆమెను గొంతునులిమి చంపేశారు. కానీ పర్వీనా ఒక హిందువును పెళ్లిచేసుకోవడంతో తాము ఆమెను చంపి కుటుంబపురువును కాపాడామని చెప్పుకొచ్చారు. ఇది నమ్మిన పర్వీనా తండ్రి ఫయాజ్ వారిద్దరికీ సహాయం చేయడానికి అంగీకరించాడు. పర్వీనా శవాన్ని తీసుకెళ్లి బావిలో పడేసాడు. 


ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు.

Updated Date - 2021-09-29T06:47:41+05:30 IST