Sep 15 2021 @ 13:07PM

Mosteligible Bachelor: 'లెహరాయి' లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. తాజాగా ఈ మూవీ నుంచి 'లెహరాయి' అనే లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను బన్నీ వాసు, వాసు వర్మతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో తాజాగా విడుదలైన రొమాంటిక్ సాంగ్ 'లెహరాయి' కూడా యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, గోపీ సుందర్ సంగీతం అందించాడు.