Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన పదార్థం.. చైనా సృష్టి!

బీజింగ్: ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన పదార్థాన్ని తాము కనిపెట్టినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇదో కర్బన పదార్థమని, దీనికి AM-III అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు అత్యంత బలమైన పదార్థంగా భావిస్తున్నా వజ్రాన్ని కూడా ఇది కోయగలదని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా వారు విడుదల చేశారు. ఈ చిత్రంలో వజ్రంపై ఉన్న గీతలను సైంటిస్టులు చూపించారు. ఈ గీతలు తమ AM-III పదార్థంతోనే ఏర్పడ్డాయని చెబుతున్నారు.

ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న అత్యంత పటిష్ఠ పదార్థాలకంటే ఇది మరింత పటిష్ఠమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఎలక్ట్రానిక్ పరికరాల్లో అత్యంత ఆవశ్యకమైన పదార్థంగా ఉన్న సిలికాన్‌తో దాదాపు సమానంగా ఈ AM-III పదార్థం కూడా విద్యుత్ వాహకంగా(సెమీకండక్టర్)గా ఉపయోగపడుతుందని చైనా శాస్త్రవేత్తల మాట. ఒకవేళ ఇదే నిజమైతే ఈ పదార్థంగా భవిష్యత్తులో టెక్నాలజీలో కూడా ఎన్నో మార్పులు సంభవించే అవకాశాలు లేకపోలేదు.

TAGS: china diamond
Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement