IPL2022లో సిక్సర్ల వర్షం.. ఎక్కువ కొట్టిన ఆటగాడెవరో తెలుసా

ABN , First Publish Date - 2022-05-19T22:12:30+05:30 IST

IPL2022లో సిక్సర్ల వర్షం కురుస్తోంది. పిచ్‌లు క్రమంగా కొద్దిగా నెమ్మదిస్తున్నట్టు కనిపిస్తున్నా సిక్సర్లు మాత్రం తగ్గడం లేదు. కుర్రాళ్ల నుంచి సీనియర్ల

IPL2022లో సిక్సర్ల వర్షం.. ఎక్కువ కొట్టిన ఆటగాడెవరో తెలుసా

ముంబై : IPL2022లో సిక్సర్ల వర్షం కురుస్తోంది. పిచ్‌లు క్రమంగా కాస్తంత నెమ్మదిస్తున్నట్టు కనిపిస్తున్నా సిక్సర్లు హోరు మాత్రం  తగ్గడం లేదు. కుర్రాళ్ల నుంచి సీనియర్ బ్యాట్స్‌మెన్స్ కొందరు భారీ సిక్సులు కొడుతూ క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ప్రస్తుత సీజన్ లీగ్ దశ ముగింపునకు వచ్చింది. జట్లన్నీ తమ చివరి మ్యాచ్‌లు ఆడుతున్నాయి. అయితే ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన బట్లర్ అత్యధికంగా 37 సిక్సులు కొట్టాడు. 627 పరుగులతో ఐపీఎల్2022 ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా బట్లర్ టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో 32 సిక్సులతో ఆండ్రూ రస్సెల్ ఉన్నాడు. ఈ కలకత్తా ఆటగాడు మొత్తం 14 మ్యాచుల్లో ఈ సిక్సర్లు కొట్టాడు. మూడవ స్థానంలో పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న లియామ్ లివింగ్‌స్టోన్ ఉన్నాడు. మొత్తం 29 సిక్సర్లు కొట్టగా అందులో అత్యంత పొడవైన 117 మీటర్ల సిక్సు కూడా ఉండడం గమనార్హం. టాప్-4 స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఈ సీజన్‌లో మే 17 నాటికి14 మ్యాచ్‌లు ఆడి 25 సిక్సలు కొట్టాడు. ఇక ఐదవ స్థానాన్ని క్వింటన్ డికాక్(లక్నో సూపర్ జెయింట్స్), నితీష్ రాణా(కోల్‌కతా నైట్‌రైడర్స్) ఇద్దరూ పంచుకున్నారు. ఇద్దరూ చెరో 22 సిక్సులు కొట్టారు.

Updated Date - 2022-05-19T22:12:30+05:30 IST