భారతీయులు ఇంటర్నెట్‌లో అత్యధికంగా వీటి కోసమే వెతికారు!

ABN , First Publish Date - 2021-12-09T21:32:08+05:30 IST

భారతీయుల క్రికెట్ అభిమానాన్ని కోవిడ్-19 మహమ్మారి

భారతీయులు ఇంటర్నెట్‌లో అత్యధికంగా వీటి కోసమే వెతికారు!

న్యూఢిల్లీ : భారతీయుల క్రికెట్ అభిమానాన్ని కోవిడ్-19 మహమ్మారి కూడా కదిలించలేకపోయిందని గూగుల్ ‘ఇయర్ ఇన్ సెర్చ్, 2021’ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టాప్ టెన్ సెర్చ్‌ లిస్ట్‌లో నిలిచాయి. వార్తలు, క్రీడలు, వినోదం, ఇతర అంశాలను ఎంత ఎక్కువ మంది అన్వేషించారో తెలిపే ‘ఇయర్ ఇన్ సెర్చ్, 2021’ నివేదికను గూగుల్ బుధవారం విడుదల చేసింది. భారత దేశంతోపాటు, 70 ఇతర దేశాల్లో సెర్చింగ్ ట్రెండ్స్‌ను ఈ నివేదిక వెల్లడించింది. 


ఓవరాల్ సెర్చింగ్ విభాగంలో టాప్-10లో భారతీయుల ధోరణి క్రింది విధంగా ఉంది. 

1. ఇండియన్ ప్రీమియర్ లీగ్

2. కోవిన్

3. ఐసీసీ టీ20 వరల్డ్ కప్

4. యూరో కప్

5. టోక్యో ఒలింపిక్స్

6. కోవిడ్ వ్యాక్సిన్

7. ఫ్రీ ఫైర్ రిడీమ్ కోడ్

8. కోపా అమెరికా

9. నీరజ్ చోప్రా

10. ఆర్యన్ ఖాన్


సినిమాలు, వంటలు, ఇతర వార్తల విభాగంలో ఈ నివేదిక ప్రకారం భారతీయులు అత్యధికంగా అన్వేషించినవాటిలో తమిళ సినిమా జై భీమ్, బాలీవుడ్ సినిమాలు షేర్‌షా, రాధే, బెల్ బాటమ్; హాలీవుడ్ సినిమా గాడ్జిల్లా వర్సెస్ కోంగ్ ఉన్నాయి. 


Updated Date - 2021-12-09T21:32:08+05:30 IST