పీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఏం జరిగిందో చెప్పిన గులాం నబీ ఆజాద్

ABN , First Publish Date - 2020-04-09T01:19:22+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అఖిలపక్ష సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో...

పీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఏం జరిగిందో చెప్పిన గులాం నబీ ఆజాద్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అఖిలపక్ష సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పలు కీలక విషయాలను వెల్లడించారు. దాదాపు 80 శాతం రాజకీయ పార్టీలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రధాని మోదీని కోరినట్లు ఆయన తెలిపారు.


ఇందుకు స్పందించిన ప్రధాని.. ముఖ్యమంత్రులతో, నిపుణులతో మాట్లాడిన తదుపరి నిర్ణయం తీసుకుంటానని సమాధానమిచ్చినట్లు గులాం నబీ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలన్నీ కరోనా కట్టడికి ఏకతాటిపైకి రావడం సంతోషంగా ఉందని ప్రధాని హర్షం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు గులాం నబీ తెలిపారు.

Updated Date - 2020-04-09T01:19:22+05:30 IST