అది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన తేలు.. దాని విషంతో ఏం చేస్తారు?.. ఖరీదు ఎంతో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-03T14:57:34+05:30 IST

ప్రపంచంలో పలు రకాల విష జీవులు మనకు కనిపిస్తాయి.

అది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన తేలు.. దాని విషంతో ఏం చేస్తారు?.. ఖరీదు ఎంతో తెలిస్తే..

ప్రపంచంలో పలు రకాల విష జీవులు మనకు కనిపిస్తాయి. సాలెపురుగులు, జెల్లీ ఫిష్, బ్లూ ఆక్టోపస్‌, పాములు, తేళ్లు.. ఇవన్నీ విషపూరితమైనవే. అయితే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన తేలు గురించి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తేలు క్యూబాలో కనిపిస్తుంది. సాధారణ తేలు మాదిరిగా కాకుండా ఇది నీలి రంగులో కనిపిస్తుంది. ఇది అత్యంత విషపూరితమైనది. పైగా దీని విషం ఎంతో ఖరీదైనది. వివిధ నివేదికల ప్రకారం ఈ తేలు విషంతో అనేక రకాల ఔషధాలను తయారు చేస్తారు. అందుకే దీని విషం ఖరీదు కోట్ల రూపాయలలో ఉంటుంది. 


క్యాన్సర్ మందు ‘విడాటాక్స్’ను ఈ తేలు విషం నుంచే తయారు చేస్తారు. ఈ తేలు విషంలో 50 లక్షలకు మించిన సమ్మేళనాలు ఉంటాయని గుర్తించారు. అయితే ఇప్పటివరకూ వీటిలో కొన్నింటిని మాత్రమే గుర్తించారు. ఈ తేలు విషంతో అనేక వ్యాధులకు ఔషధాలను తయారు చేస్తుంటారు. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ మైఖేల్ గురేవిట్జ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ తేలు విషంపై అనేక వైద్య పరిశోధనలు జరుగుతున్నాయి. నొప్పి నివారిణిగా కూడా ఈ విషం ఉపయోగపడుతుందని గుర్తించారన్నారు. ఆర్థరైటిస్‌ వ్యాధి నివారణకూ కూడా ఈ తేలు విషం ఉపయోగపడుతుందని తేలింది.  ఈ పాయిజన్‌లోని మూలకాలు క్యాన్సర్‌కు కారణమైన కణాలు ఏర్పడకుండా నిరోధిస్తాయని వివిధ పరిశోధనల్లో తేలింది. ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బ్లూ స్కార్పియన్ విషాన్ని ‘అవయవ మార్పిడి’ సమయంలో కూడా ఉపయోగించవచ్చు. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

Updated Date - 2022-01-03T14:57:34+05:30 IST