కోలుకుంటున్న వారే ఎక్కువ!

ABN , First Publish Date - 2020-10-18T10:07:09+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా వైరస్‌ బారిన పడే వారి కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది.

కోలుకుంటున్న వారే ఎక్కువ!

కొత్తగా 1,451 పాజిటివ్‌లు.. 2.20 లక్షలకు చేరిన కేసులు


హైదరాబాద్‌, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా వైరస్‌ బారిన పడే వారి కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం రోజూ 40వేల పైచిలుకు పరీక్షలు చేస్తుండగా.. 2వేలలోపే కేసులు నమోదవుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 42,497 పరీక్షలు చేయగా.. కొత్తగా 1,451 మంది కరోనా బారినపడ్డారు. తాజాగా పాజిటివ్‌లతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,20,675కు చేరింది. మరణించిన వారి సంఖ్య 1,265కు చేరింది. శుక్రవారం 1,983 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవ్వగా, ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 1,96,636కి పెరిగింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 235 కేసులు రాగా, మేడ్చల్‌లో 101, రంగారెడ్డిలో 104, కొత్తగూడెంలో 92, ఖమ్మంలో 71, కరీంనగర్‌లో 65, నల్లగొండలో 84, సిద్దిపేటలో 64, వరంగల్‌ అర్బన్‌లో 55 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-10-18T10:07:09+05:30 IST