9 రాష్ట్రాల్లో అత్యధిక కేసులు

ABN , First Publish Date - 2020-08-08T07:34:32+05:30 IST

దేశంలో కరోనా ఉధృతికి అద్దంపడుతూ.. మరోసారి అత్యధిక కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ సహా 9 రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రంగా ఉంది...

9 రాష్ట్రాల్లో అత్యధిక కేసులు

  • మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, యూపీల్లో తీవ్రం


న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలో కరోనా ఉధృతికి అద్దంపడుతూ.. మరోసారి అత్యధిక కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ సహా 9 రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రంగా ఉంది. వీటిలో గరిష్ఠ సంఖ్యలో పాజిటివ్‌లు వస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కేసులు, మరణాలు రెండూ అత్యధికంగా నమోదయ్యాయి. కాగా, దేశంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం 8 గంటల మధ్య రికార్డు స్థాయిలో 62,583 కేసులు నమోదయ్యాయి. దీంతో మరోసారి అమెరికా, బ్రెజిల్‌ను నుంచి భారత్‌లో రోజువారీ ఎక్కువ కేసులు వచ్చినట్లైంది. వైర్‌సతో కొత్తగా 886 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 41,585కు చేరింది. మరోవైపు దేశంలో జూలై 17వ తేదీన 10 లక్షలుగా ఉన్న కరోనా బాధితుల సంఖ్య.. మూడు వారాల్లోనే రెట్టింపైంది. ఆగస్టులో ఆరు రోజుల్లోనే 4 లక్షల మందికి పైగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. యాక్టివ్‌ కేసులు తగ్గుతున్నప్పటికీ.. కొత్త ప్రాంతాల్లో కొవిడ్‌ విజృంభిస్తోందని కేంద్ర అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు హాట్‌స్పాట్‌లుగా మారినందునే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని అన్నారు. 


మహారాష్ట్రలో కరోనా కేసులు 5 లక్షలకు చేరువవుతున్నాయి. మరణాలు 16 వేలు దాటాయి. శుక్రవారం రాష్ట్రంలో మరో 10,500 మందికి వైరస్‌ సోకింది. 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైకి వచ్చేవారికి 14 రోజుల హోం క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తూ కార్పొరేషన్‌ ఆదేశాలిచ్చింది. తమిళనాడులో కొత్తగా 119 మంది చనిపోయారు. 5,880 కేసులు వచ్చాయి. కర్ణాటకలో   6,670 కరోనా కేసులు నమోదయ్యాయి. 101 మంది మృతి చెందారు.


Updated Date - 2020-08-08T07:34:32+05:30 IST