రెవెన్యూ శాఖపైనే అధిక కేసులు

ABN , First Publish Date - 2022-05-19T05:59:39+05:30 IST

అధికశాతం రెవెన్యూ శాఖపైనే తమకు ఫిర్యాదులు అందుతున్నాయని లోకాయుక్తా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన బి.కొత్తకోటలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగానికి పౌరులకు మధ్య వారధిగా లోకాయుక్తా పని చేస్తున్నదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడడమే ప్రధాన లక్ష్యమన్నారు.

రెవెన్యూ శాఖపైనే అధిక కేసులు

లోకాయుక్తా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి

బి.కొత్తకోట మే 18: అధికశాతం రెవెన్యూ శాఖపైనే తమకు ఫిర్యాదులు అందుతున్నాయని లోకాయుక్తా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన బి.కొత్తకోటలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగానికి పౌరులకు మధ్య వారధిగా లోకాయుక్తా పని చేస్తున్నదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడడమే ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యంగా పట్టదారు పాసుబుక్కుల మంజూరు, మ్యుటేషన్‌, భూములకు సంబంధించిన ఆన్‌లైన్‌ నమోదు విషయాల్లో తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, ప్రస్తుతం లోకాయుక్తాలో 5 వేల కేసులు ఉండగా, అందులో 2 వేల కేసులు రెవెన్యూ శాఖ అధికారులపైనే వస్తున్నాయన్నారు. తరువాత స్థానం మున్సిపాలిటీలపై ఉందన్నారు. ఎవరైనా లోకాయుక్తాకు ఫిర్యాదు చేస్తే అటువంటి వారిపై వ్యక్తిగత ద్వేషం పెంచుకోకుండా, లోపాలను సరిదిద్దుకోవాలని అధికారులకు హితవు పలికారు. గత ఏప్రిల్‌ నుంచి కర్నూల్‌ కేంద్రంగా లోకాయుక్తా పనిచేస్తున్నదని, ప్రస్తుతం 5 వేల కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటి ప రిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా వ్యవసాయ రంగం అభివృద్ధి సాధించాలంటే రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే రిజిస్ర్టార్‌, లోకాయుక్తా కర్నూల్‌ అడ్ర్‌సకు రూ.150 డీడీ తీసి తగిన డాక్యుమెంట్లను, జిరాక్స్‌ ప్రతులను జత చేసి పంపవచ్చన్నారు. 

Updated Date - 2022-05-19T05:59:39+05:30 IST