ముగ్గురిలో ఒకరు వీక్షించేది ఆన్‌లైన్‌ వీడియోలే!

ABN , First Publish Date - 2020-06-05T08:03:42+05:30 IST

ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఆన్‌లైన్‌ వీడియోలను వీక్షిస్తున్నారట! రోజుకు సగటున గంటకుపైగా ఆన్‌లైన్‌ వీక్షణలో ఉంటున్నట్టు గూగుల్‌ ఓ నివేదికలో పేర్కొంది...

ముగ్గురిలో ఒకరు వీక్షించేది ఆన్‌లైన్‌ వీడియోలే!

  • హిందీ భాషకు 54శాతం మొగ్గు
  • తెలుగుకు మూడో స్థానం: గూగుల్‌

న్యూఢిల్లీ, జూన్‌ 4 : ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఆన్‌లైన్‌ వీడియోలను వీక్షిస్తున్నారట! రోజుకు సగటున గంటకుపైగా ఆన్‌లైన్‌ వీక్షణలో ఉంటున్నట్టు గూగుల్‌ ఓ నివేదికలో పేర్కొంది. ఆన్‌లైన్‌ వీడియోలను తిలకించేందుకు 54 శాతం హిందీ భాషనే ఎంచుకుంటున్నారు. ఆ తరువాత స్థానాలను ఇంగ్లిష్‌(16ు), తెలుగు(7ు) కన్నడం(6ు), తమిళం(5ు), బెంగాలీ(3ు) భాషలు ఆక్రమించాయి. ఈ ఏడాది ఆన్‌లైన్‌ వీడియో వీక్షకుల సంఖ్య 50 కోట్లు పెరుగుతుందని అంచనా. ఆన్‌లైన్‌ వీడియో వీక్షకుల్లో 37 శాతం గ్రామీణ ప్రాంతాలవారే కావడం విశేషం. 6500 మంది వీక్షకుల నుంచి గూగుల్‌ అభిప్రాయాలు సేకరించి ఈ నివేదిక రూపొందించింది.  


Updated Date - 2020-06-05T08:03:42+05:30 IST