గొర్రె ఖరీదు 3.5 కోట్లు!

ABN , First Publish Date - 2020-09-03T05:30:00+05:30 IST

మన దగ్గర ఒక గొర్రె మహా అయితే ఇరవై వేలు ధర పలుకుతుంది. కానీ స్కాట్లాండ్‌లో జరిగిన ఒక వేలంలో ఒక గొర్రె అక్షరాలా మూడున్నర కోట్ల రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఆ గొర్రె పేరు డబుల్‌ డైమండ్‌...

గొర్రె ఖరీదు 3.5 కోట్లు!

మన దగ్గర ఒక గొర్రె మహా అయితే ఇరవై వేలు ధర పలుకుతుంది. కానీ స్కాట్లాండ్‌లో జరిగిన ఒక వేలంలో ఒక గొర్రె అక్షరాలా మూడున్నర కోట్ల రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఆ గొర్రె పేరు డబుల్‌ డైమండ్‌. 


  1. చెషైర్‌కు చెందిన చార్లీ బొడెన్‌ అనే వ్యక్తి ఈ గొర్రెను విక్రయించాడు. ఆ గొర్రె అంత ధర పలుకుతుందని అతడు కూడా ఊహించలేదు. ఒక్కసారిగా కోట్ల రూపాయలు వచ్చి పడడంతో ఉబ్బితబ్బియ్యాడు. 
  2. కళ్లు, రూపం, రంగు అన్నింటిలోనూ ఈ గొర్రె ఎంతో ప్రత్యేకం. మేలుజాతి గొర్రెల ఉత్పత్తి కోసం ఈ గొర్రె పనికొస్తుంది. అందుకే రైతులు వేలంలో పోటీపడ్డారు. కొందరు రైతులు సంయుక్తంగా కలిసి వేలంలో ఎక్కువ ధరకు దక్కించుకున్నారు. 
  3. ఈ రకం గొర్రెలు నెదర్లాండ్స్‌లోని టెక్సెల్‌ ద్వీపంలోనవి. వీటిని గొర్రెలలో అత్యుత్తమమైనవిగా చెబుతారు. వీటి మాంసం నాణ్యంగా, రుచిగా ఉంటుంది.

Updated Date - 2020-09-03T05:30:00+05:30 IST