Expensive Pillow: ఈ దిండు ఖరీదు సుమారు అరకోటి.. ఇంతకూ దీని స్పెషాలిటీ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-24T13:43:43+05:30 IST

హెడ్డింగ్ చూసి.. దిండు ఖరీదు సుమారు అరకోటి ఏంటని షాకయ్యారా? నమ్మశక్యంగా లేకున్నా ఇదే నిజం. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ దిండు విలువ 57వేల డాలర్లు. భారతీయ కరెన్సీ‌లో చెప్పాలంటే దాదాపు రూ

Expensive Pillow: ఈ దిండు ఖరీదు సుమారు అరకోటి.. ఇంతకూ దీని స్పెషాలిటీ ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: హెడ్డింగ్ చూసి.. దిండు ఖరీదు సుమారు అరకోటి ఏంటని షాకయ్యారా? నమ్మశక్యంగా లేకున్నా ఇదే నిజం. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ దిండు విలువ 57వేల డాలర్లు. భారతీయ కరెన్సీ‌లో చెప్పాలంటే దాదాపు రూ.45లక్షలు. కాగా.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి కోసం అనేక రకాల పిల్లోలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నా.. ఇది మాత్రం ఎందుకంత ఖరీదు? ఇంతకూ దీని స్పెషాలిటీ ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పిల్లో‌ను నెదర్లాండ్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్ తయారు చేశాడు. ఈ దిండును తయారు చేయడానికి ఆ థెరపిస్ట్‌కు దాదాపు 15 సంవత్సరాల సమయం పట్టిందట. ఇందుకోసం అనేక పరిశోధనలు చేసినట్లు సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ దిండులో కాటన్‌ను రొబోటిక్ మిల్లింగ్ మిషన్ ద్వారా అమర్చారట. అంతేకాకుండా ఈ పిల్లో తయారీకి బంగారం, డైమెండ్లను కూడా ఉపయోగించారట. దిండుకు ఉన్న జిబ్‌కు నాలుగు ఖరీదైన డైమెండ్లు ఉన్నాయట. 



వీటితోపాటు విలువైన నీలి రంగు రాయిని కూడా ఈ పిల్లోకు అమర్చారట. దీంతో ఈ పిల్లో ధర భారీగా పలుకుతోంది. కాగా.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్లు ఈ దిండును వేసుకుంటే.. ప్రశాంతంగా నిద్రపోతారని ఫిజియోథెరపిస్ట్ బల్లగుద్దీ మరీ చెబుతున్నాడు. అయితే పిల్లోకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ దిండును వేసుకుంటే.. ప్రశాంతంగా పడుకోవచ్చోలేదో కానీ.. దొంగల భయంతో వొచ్చే నిద్ర కాస్తా పోతుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Updated Date - 2022-06-24T13:43:43+05:30 IST