Abn logo
Aug 11 2020 @ 02:01AM

రూ.11.24 కోట్ల మాస్కు !

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరోనా మాస్కును ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వజ్రాల కంపెనీ తయారు చేయనుంది. అమెరికాలో నివసిస్తున్న చైనా వ్యాపారవేత్త ఆర్డర్‌ మేరకు 3,600 తెలుపు, నలుపు వజ్రాలు పొదిగిన 18 క్యారెట్ల బంగారు మాస్కు ధరను 1.5 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.11.24 కోట్లు)గా నిర్ణయించింది. వినియోగదారుడి కోరిక మేరకు ఇందులో ఎన్‌-99 ఫిల్టర్లను కూడా ఏర్పాటు చేస్తామని మాస్కు తయారీదారు ఇసాక్‌ లెవీ తెలిపారు. దీన్ని వినియోగదారుడికి ఈ ఏడాది చివరికి అందజేస్తామని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement