Oct 17 2021 @ 12:42PM

'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్': ఆ వార్తల్లో నిజం లేదు..

ఇటీవల రిలీజైన 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' మూవీకి సంబంధించి వస్తున్న వార్తల్లో నిజం లేదని నిర్మాత తాజాగా తెలిపారు. అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన బ్యూటుఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్'. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిచారు. దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముదుకు వచ్చిన ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని విజయవంతగా ప్రదర్శింపబడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే నవంబర్ 12 సినిమా తెలుగు ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని స్ట్రీమింగ్‌కి రావడానికి కాస్త టైం పడుతుందని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.