ఆహాలో వచ్చేస్తోన్న అక్కినేని ‘బ్యాచ్‌లర్’

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ చిత్రంలో అచ్చ తెలుగు ఓటీటీ మాధ్యమం అయిన ఆహాలో నవంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక వార్తను ‘ఆహా’ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ చిత్రంగా నిలబడింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను ఆహాలో రిపీట్ చేయ‌డానికి ఈ బ్యాచ్‌లర్ రెడీ అవుతున్నాడు. 


ఈ చిత్రంలో ఆహాలో విడుదల అవుతుందని తెలుపుతూ క‌ట్ చేసిన ట్రైల‌ర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో అఖిల్ హ‌ర్ష అనే కేర‌క్ట‌ర్ చేశాడు. రెండు ప‌దులు దాటిన వ‌య‌సున్న యంగ్‌స్ట‌ర్ హ‌ర్ష‌.. త‌నకు స‌రైన జోడీని వెతుక్కుంటూ శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఇండియాకు వ‌స్తాడు. అన్నీ అనుకున్న‌ట్టే జ‌రిగినా, పెళ్లికూతురు మాత్రం అత‌ని అభిరుచుల‌కు అనుగుణంగా దొర‌క‌దు. అలాంటి స‌మయంలో అత‌నికి విభ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. జీవితాన్ని ఆస్వాదించే హ్యాపీ గో ల‌క్కీ స్టాండ‌ప్ క‌మెడియన్ విభ‌. ఆమె ప‌రిచ‌యం అయ్యాక హ‌ర్ష‌, జీవితాన్ని చూసే తీరే మారిపోతుంది. ప్రేమ గురించి, బంధాల గురించి అప్ప‌టిదాకా అత‌ని మ‌న‌సులో ఉన్న అభిప్రాయాలు మారుతాయి. ఇంత‌కీ, హ‌ర్ష - విభ జంట క‌లిసిందా?  లేదా అనేది ఆస‌క్తిక‌రం. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆధునిక జీవితంలో చాలా మంది ఫేస్ చేస్తున్న రిలేష‌న్‌షిప్ ఇష్యూస్‌ని సెన్సిటివ్‌గా డీల్ చేసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌. థియేటర్‌లో సందడిసందడి చేసి మెప్పించిన ఈ బ్యాచ్‌లర్.. ఇప్పుడు ఓటీటీలో ఎటువంటి రిజల్ట్‌ని అందుకుంటాడో చూద్దాం.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement