Abn logo
May 18 2020 @ 12:22PM

బ్యాచిలర్ అప్పుడు వస్తాడా?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ తొలి విజయం కోసం ఎప్పట్నుంచో నిరీక్షిస్తున్నాడు. ఇప్పటికి మూడు సినిమాల్లో నటించినప్పటికీ అవన్నీ అఖిల్‌కు నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం అఖిల్ `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్` సినిమాలో నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. 


ఈ సినిమా వేసవికే విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఓటీటీల నుంచి ఈ సినిమాకు మంచి ఆఫర్‌లు వస్తున్నాయట. అయితే నిర్మాత మాత్రం అందుకు అంగీకరించడం లేదట. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని భావిస్తున్నారట. దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. 

Advertisement
Advertisement
Advertisement