ప్రతి సంవత్సరం టైమ్స్ సంస్థ ప్రకటించే మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ల జాబితా శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాలో తొలి స్థానాన్ని శ్రుతి హాసన్ సొంతం చేసుకున్నారు. తర్వాతి స్థానాల్లో సమంత, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్, రష్మిక ఉన్నారు. అదితీ రావ్ హైదరీ ఆరో స్థానంలో, కాజల్ అగర్వాల్ 9లో, తమన్నా 17లో ఉన్నారు. బిగ్‌బాస్ ఫేమ్ దివి వాద్య 20వ స్థానం దక్కించుకున్నారు. మరో తెలుగు నటి ఈషా రెబ్బ 29వ స్థానంలో ఉన్నారు.
స్థానాల వారీగా మన తారలు:
1. శ్రుతీహాసన్ 2013లో మోస్ట్ డిజైరబుల్ విమెన్‌గా నిలిచారు. మళ్లీ ఈ ఏడాది అగ్రస్థానం సంపాదించుకోవడం విశేషం.
2. సమంత అక్కినేని
3. పూజా హెగ్డే,
4. రకుల్ ప్రీత్,
5. రష్మిక