Abn logo
Aug 27 2020 @ 21:59PM

50 సంవత్సరాల క్రితమే పాన్ ఇండియా ఫిల్మ్ చేసిన సూపర్ స్టార్

ఇప్పుడు మన స్టార్ హీరోలు కొందరు పాన్ ఇండియా ఫిల్మ్స్‌కు ఇంట్రెస్ట్ చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అయితే పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ చిత్రంతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే వీరంతా ఇప్పుడు పాన్ ఇండియా కోసం ఎగబడుతున్నారు కానీ.. 50 సంవత్సరాల క్రితమే పాన్ ఇండియాకు తెలుగు సినిమా పవరేంటో చూపించాడు సూపర్ స్టార్ కృష్ణ అని అంటున్నారు నిర్మాత జి. ఆదిశేషగిరిరావు.



శ్రీ పద్మాలయా మూవీస్ బ్యానర్‌పై సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఆయన నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పద్మాలయ బ్యానర్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ఆగస్ట్ 27న విడుదలైన ఈ చిత్రంతో ప్రపంచ ప్రఖ్యాత బ్యానర్లలో ఒకటిగా ఈ బ్యానర్ నిలిచింది. ఇండియన్ స్క్రీన్‌పై మొట్టమొదటి కౌబాయ్ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. ఈ ఆగస్ట్ 27తో 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం 1971 ఆగస్టు 27న తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీతో పాటు మరికొన్ని ఇతర భాషలలో విడుదలైంది. ఇప్పుడు మనవాళ్లు అనుకుంటున్న పాన్ ఇండియా చిత్రాన్ని.. 50 సంవత్సరాల క్రితమే సూపర్‌స్టార్ కృష్ణ చేశారు..’’ అని ఆదిశేషగిరిరావు తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement