కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి పవార్‌కు COVID positive

ABN , First Publish Date - 2022-01-06T15:37:45+05:30 IST

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్‌కు గురువారం కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది...

కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి పవార్‌కు COVID positive

న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్‌కు గురువారం కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని మంత్రి డాక్టర్ భారతి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.‘‘ఈరోజు నాకు కొవిడ్-19 టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. నేను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోండి, కరోనా నివారణ నియమాలను అనుసరించండి’’ అని కేంద్ర మంత్రి డాక్టర్ భారతి ట్విట్టర్‌లో కోరారు.దేశంలో గత 24 గంటల్లో గురువారం 90,928 కొత్త కొవిడ్-19 కేసులు, 325 మరణాలు సంభవించాయి.దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,82,876 కు చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 2,85,401కు పెరిగాయి. 


Updated Date - 2022-01-06T15:37:45+05:30 IST