సంపన్న దేశాల్లో మరణమృదంగం

ABN , First Publish Date - 2020-04-10T17:01:21+05:30 IST

కోవిడ్-19 ప్రపంచ మానవాళిని కబళిస్తోంది.

సంపన్న దేశాల్లో మరణమృదంగం

కోవిడ్-19 ప్రపంచ మానవాళిని కబళిస్తోంది. సంపన్నదేశాల్లో మరణ మృదంగంమ్రోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 16 లక్షలు దాటేసింది. మృతుల సంఖ్య 96వేలు దాటింది. మరికొన్ని గంటల్లో లక్ష మరణాల సంఖ్య దాటనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు కరోనా బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,55,000గా ఉంది. తొలుత చైనా, ఆ తర్వాత ఇరాన్, ఇటలీలో మృత్యుఘోష  మిగిల్చిన కరోనా ఇప్పుడు సంపన్నదేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లై ప్రతాపం చూపిస్తోంది. అమెరికాలో రోజుకు 2వేల మంది చొప్పున చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్ రాష్ట్రం శ్మశానాన్ని తలపిస్తోంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే 6,200 మందికిపైగా  మరణించారు.

Updated Date - 2020-04-10T17:01:21+05:30 IST