IAF chopper crashలో మరో ఆరుగురి మృతదేహాల గుర్తింపు

ABN , First Publish Date - 2021-12-11T14:43:00+05:30 IST

తమిళనాడులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మరో ఆరుగురు రక్షణ సిబ్బంది మృతదేహాలను శనివారం గుర్తించారు....

IAF chopper crashలో మరో ఆరుగురి మృతదేహాల గుర్తింపు

న్యూఢిల్లీ : తమిళనాడులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మరో ఆరుగురు రక్షణ సిబ్బంది మృతదేహాలను శనివారం గుర్తించారు.హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 13 మందిలో నలుగురు ఐఏఎఫ్, ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించారు. జూనియర్ వారెంట్ ఆఫీసర్లు ప్రదీప్ అరక్కల్, రాణా ప్రతాప్ దాస్, వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్, లాన్స్ నాయక్ బి సాయి తేజ,లాన్స్ నాయక్ వివేక్ కుమార్ ల మృతదేహాలను గుర్తించి వాటిని విమానాల్లో తరలిస్తున్నారు.


లాన్స్ నాయక్ బి సాయితేజ, లాన్స్ నాయక్ వివేక్ కుమార్ భౌతికకాయాలను శనివారం కుటుంబ సభ్యులకు అంద చేశారు.మిగిలిన సిబ్బంది భౌతికకాయాలను విమానంలో తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించే ముందు ఢిల్లీ కంటోన్మెంటులోని బేస్ హాస్పిటల్‌లో పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.


Updated Date - 2021-12-11T14:43:00+05:30 IST