Morocco: భారతీయులకు గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2022-02-23T21:28:38+05:30 IST

భారతీయులకు నార్త్ ఆఫ్రికన్ కంట్రీ మొరాకో గుడ్‌న్యూస్ చెప్పింది. వీసాల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. టూరిస్ట్, విజిటర్ వీసాల కోసం భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అన్ని

Morocco: భారతీయులకు గుడ్‌న్యూస్!

ఎన్నారై డెస్క్: భారతీయులకు నార్త్ ఆఫ్రికన్ కంట్రీ మొరాకో గుడ్‌న్యూస్ చెప్పింది. వీసాల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. టూరిస్ట్, విజిటర్ వీసాల కోసం భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అన్ని కేటగిరీలకు సంబంధించిన వీసా దరఖాస్తులను స్వీకరిస్తున్న స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ వీసా కన్సల్టెంట్ కూడా ధ్రువీకరించింది. న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముంబై తదితర నగరాల్లోని వీసా అప్లికేషన్ సెంటర్ల ద్వారా భారతీయలు వీసా కోసం అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. టూరిస్ట్, విజిటర్ వీసాల కోసం రూ.2,560 చెల్లించాలని చెప్పింది. దీంతోపాటు టూరిజం ప్రమోషనల్ ఛార్జీల కింద మరో రూ.140 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.



కాగా.. కొవిడ్ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో తీసుకున్న ప్రయాణికులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను చూపించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్‌ను కూడా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ప్రయాణికులు మొరాకో చేరిన తర్వాత అక్కడి అధికారులు ర్యాండమ్ రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేస్తారని పేర్కొంటున్నారు. ఇక కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారి విషయానికి వస్తే.. సదరు ప్రయాణికులు గవర్నమెట్ ధ్రువీకరించిన హోటళ్లలో సుమారు 10రోజులపాటు క్వారెంటైన్‌లో ఉండాలని చెబుతున్నారు. 




Updated Date - 2022-02-23T21:28:38+05:30 IST