ప్రజలకు దేవిరెడ్డి మార్నింగ్‌ ‘వాక్కు’..

ABN , First Publish Date - 2021-01-24T07:34:50+05:30 IST

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి శనివారం హయత్‌నగర్‌ డివిజన్‌లోని సుమారు 18 కాలనీలలో కార్పొరేటర్‌ తిరుమల్‌రెడ్డి, అధికారులతో కలిసి పర్యటించి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, పార్కుల అభివృద్ధిపై చర్చించారు.

ప్రజలకు దేవిరెడ్డి మార్నింగ్‌ ‘వాక్కు’..
మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

హయత్‌నగర్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి శనివారం హయత్‌నగర్‌ డివిజన్‌లోని సుమారు 18 కాలనీలలో కార్పొరేటర్‌ తిరుమల్‌రెడ్డి, అధికారులతో కలిసి పర్యటించి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, పార్కుల అభివృద్ధిపై చర్చించారు. ప్రధానంగా ఉన్న డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యను రెండునెలలో పరిష్కరిస్తానని కట్టమైసమ్మ కాలనీ, షిర్డినగర్‌ కాలనీ వాసులకు హమీ ఇచ్చారు. ఆయా పనుల అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై స్పష్టమైన అవగాహన కోసం ప్రతి నెల రెండుసార్లు మార్నింగ్‌ వాక్‌ నిర్వహిస్తున్నట్లు సుధీర్‌రెడ్డి తెలిపారు. 34 సంవత్సరాలుగా మార్నింగ్‌ వాక్‌లో అనేక జటిలమైన సమస్యలను కూడా పరిష్కరించినట్లు తెలిపారు. తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని విడవనని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతి వినతిపత్రాన్ని జాగ్రతగా పరిశీలించి సంబంధింత అధికారుల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. మార్నింగ్‌ వాక్‌ ప్రారంభించి నేటికి 34 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. అక్బర్‌బాగ్‌ కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో ఆంధ్ర కాలనీ(ఎంపీకాలనీ)కి తాగునీరు అందడం లేదని కాలనీవాసులు ఫిర్యాదు చేయగా, తెల్లవారుజామున 4.30 గంటలకు సదరు కాలనీకి వెళ్లి లో ప్రెజర్‌ నీటిని పరిశీలించి, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించానని వివరించారు. నాటి నుంచి మొదలు పెట్టి నేటి దాకా మార్నింగ్‌ వాక్‌ కొనసాగిస్తున్నానని ఎమ్మెల్యే చెప్పారు.

Updated Date - 2021-01-24T07:34:50+05:30 IST