ఓవర్‌వెయిట్ ‘పిలుపు’ తర్వాత... పెరిగిన ‘మోర్గాన్ స్టాన్లీ’ షేర్ ధర....

ABN , First Publish Date - 2021-07-06T23:35:43+05:30 IST

మోర్గాన్ స్టాన్లీ సంస్థ తన స్టాక్‌పై "ఓవర్‌వెయిట్" పిలుపునిచ్చిన తరువాత... ఈ రోజు(జూలై 6) ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్ ధర ఇంట్రాడేలో 8 శాతానికి పెరిగింది.

ఓవర్‌వెయిట్ ‘పిలుపు’ తర్వాత... పెరిగిన ‘మోర్గాన్ స్టాన్లీ’ షేర్ ధర....

ముంబై : మోర్గాన్ స్టాన్లీ సంస్థ తన స్టాక్‌పై "ఓవర్‌వెయిట్" పిలుపునిచ్చిన తరువాత... ఈ రోజు(జూలై 6) ఏయూ  స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్ ధర ఇంట్రాడేలో 8 శాతానికి పెరిగింది. గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ‘ఓవర్‌వెయిట్’కాల్‌ను రూ . 1,150 టార్గెట్ వద్ద ఉంచింది. జీఎన్‌పీఎల్‌లు వరుసగా ఫ్లాట్‌గా ఉన్నాయని, అయితే మొదటి త్రైమాసికంలో బ్యాంకు రెండు శాతం టోటల్ ఇంపైర్‌డ్ రుణాలను ఇప్పుడు 8.2 శాతంతో రీస్ట్రక్చర్ చేసిందని సమాచారం. 


బ్యాంకు ఇసీఎల్‌జీఎస్ రుణాలు మొదటి త్రైమాసికంలో రూ. 20 కోట్లు, వార్షికంగా రూ. 300 కోట్లు కాగా, ఏయూఎం  వృద్ధి వార్షిక ప్రాతిపదికన స్థిరంగా ఉందని, త్రైమాసికంగా చూస్తే 3 శాతం తగ్గిందని తెలిపింది. ఈ స్టాక్ రూ . 85.50 లేదా 8.29 శాతం పెరిగి రూ. 1,116.65 వద్ద ట్రేడవుతోంది. ఇది ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ. 1,123, కనిష్ట ధర రూ. 1,045 ను తాకింది. ఐదు రోజుల సగటు 50,660 షేర్లతో పోలిస్తే ఈ స్క్రిప్ట్ 2,16,746 షేర్లతో ట్రేడవుతుండగా... ఇది 327.84 శాతం మేర పెరిగింది.

Updated Date - 2021-07-06T23:35:43+05:30 IST