చాణక్యనీతి: డబ్బు సంపాదించాలనే తపనలో వీటిని కోల్పోతే... జీవితాంతం పశ్చాత్తాపమే!

ABN , First Publish Date - 2022-06-18T12:22:09+05:30 IST

మనిషికి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనదిగా...

చాణక్యనీతి: డబ్బు సంపాదించాలనే తపనలో వీటిని కోల్పోతే... జీవితాంతం పశ్చాత్తాపమే!

మనిషికి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనదిగా ఆచార్యచాణక్య భావించాడు. డబ్బు ఉంటే ఎవరైనా సరే తమకు అవసరమైన ప్రతిదానినీ కొనుగోలు చేయవచ్చు. డబ్బు ఉన్న వ్యక్తి తన కుటుంబాన్ని పోషించగలడు. డబ్బు ఎంత ముఖ్యమో దాని విషయంలో కూడా అంతే జాగ్రత్త వహించాలని ఆచార్య చెప్పారు. ఎందుకంటే డబ్బు ఉండే వ్యక్తి ఆ డబ్బును చూసి  గర్విస్తే, అది ఒక రాజును సైతం పేదవానిగా చేయగలదు. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం డబ్బు సంపాదించాలనే తపనలో మూడు అంశాలను ఎప్పుడూ కోల్పోకూడదు. 


ఈ మూడింటిని పోగొట్టుకున్న వ్యక్తి ధనవంతుడు అయిన తర్వాత కూడా పేదవానిగానే జీవిస్తాడు. ఆచార్య చాణక్యుడు తన నీతిలో ఈ మూడు అంశాలను డబ్బు కంటే అధికమైనవని అభివర్ణించాడు. జీవితానికి డబ్బు, ప్రేమ రెండూ చాలా ముఖ్యమని ఆచార్య చాణక్య చెప్పారు. కొందరు కుటుంబాన్ని విడిచిపెట్టి డబ్బుతో ఆనందించవచ్చనుకుంటారు. మరికొందరు ప్రేమ కోసం సంపదను వదులుకుంటారు. ప్రేమ ముందు డబ్బుకు ఎంతమాత్రం విలువ లేనిదని అంటాడు ఆచార్య. ఎందుకంటే ప్రేమను డబ్బుతో కొనలేం. ఇతరులతో సంబంధాలను కాపాడుకోవాలంటే డబ్బు ప్రస్తావన ఎప్పుడూ రాకూడదు. ఎంతటి ధనవంతులైనా వారిని ఎవరూ ప్రేమించకపోతే, వారు పేదవారే. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఎవరైనా సరే సంపద కంటే మతానికి గౌరవమివ్వాలి. ఎందుకంటే మతం అనేది మనిషికి మంచి చెడుల గుర్తింపుతో పాటు జీవన విధానాన్ని తెలియజేస్తుంది. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఎవరైనా డబ్బు సంపాదన కోసం మతాన్ని త్యజిస్తే, వారికి సమాజంలో గౌరవం తగ్గుతుంది. మతాన్ని అనుసరించని వ్యక్తి చెడు మార్గంలో నడుస్తాడు. అందరి ద్వేషానికి బలి అవుతాడు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషికి అతని ఆత్మగౌరవం ద్వారా  తగిన గుర్తింపు వస్తుంది. మనిషి కష్టపడితే మళ్లీ డబ్బు సంపాదించవచ్చు, కానీ ఒకసారి ఆత్మగౌరవం పోయినట్లయితే, దానిని తిరిగి పొందడం చాలా కష్టం. వ్యక్తి ఆత్మగౌరవం కోసం డబ్బును త్యాగం చేయవలసి వచ్చినప్పటికీ, వెనక్కి తగ్గకూడదు. అప్పుడే మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందుతాడు. 

Updated Date - 2022-06-18T12:22:09+05:30 IST