మరింత పటిష్టంగా శాంతి భద్రతల పరిరక్షణ

ABN , First Publish Date - 2022-06-26T06:21:47+05:30 IST

రామగుండం కమిషనరేట్‌లో మరిం త పటిష్టంగా శాంతి భద్రతల ను పరిరక్షిస్తామని కమిషనర్‌, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొ న్నారు.

మరింత పటిష్టంగా శాంతి భద్రతల పరిరక్షణ
మాట్లాడుతున్న సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

- సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

కొల్‌సిటీ, జూన్‌ 25: రామగుండం కమిషనరేట్‌లో మరిం త పటిష్టంగా శాంతి భద్రతల ను పరిరక్షిస్తామని కమిషనర్‌, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొ న్నారు. శనివారం కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్‌లో గోదావరిఖని సబ్‌డివిజన్‌ ఏఆర్‌,సివిల్‌ సిబ్బం దికి వీక్లి పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఐజీ గౌరవ వందనం స్వీకరిం చారు. శాంతి భద్రతలు విఘా తం కలిగిన సందర్భాలు, ఆందో ళనల సమయాల్లో జనాన్ని చెద రగొట్టడం, ఆయుధాలను ఉపయోగించడం, సమస్యను అదుపులోకి తీసుకురావడం, గాయపడిన ఆందోళనకారులు, సిబ్బందిని తరలిం చడం వంటి వాటిపై మాబ్‌ రిహార్సల్‌ ప్రాక్టీస్‌, ఆర్మ్స్‌ డ్రిల్‌, ఫుట్‌ డ్రిల్‌, లాఠీ డ్రిల్‌, ట్రాఫిక్‌ డ్రిల్‌, సెర్మోనల్‌ డ్రిల్‌లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో మరింత పటిష్టంగా వ్యవహరించి పోలీస్‌శాఖకు పేరుకు తీసుకురా వాలన్నారు. ఆందోళన సందర్భాల్లో వ్యవహరించాల్సిన విషయాలపై సిబ్బందికి, అధికారులకు సూచించారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అప్రమత్తంగా ఉంటూ ఎదుర్కొవాలన్నారు. లాఠీ, రైట్‌ గేర్‌ పార్టీ సామగ్రిని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వీక్లి పరే డ్‌ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ, యూనిటీగా ఉండడం, ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌కు ఉపయోగపడుతుందన్నారు. సమయం దొరికినప్పుడల్లా సి బ్బంది, అధికారులు వ్యాయామం చేయాలన్నారు. ప్రజల మన్నన లు పొందేలా పోలీసులు పనిచేయాలన్నారు. ఈ పరేడ్‌లో ఏసీపీ గిరిప్రసాద్‌, ట్రాఫిక్‌ ఏసీపీ బాలరాజు, ఆర్‌ఐ మధుకర్‌, శ్రీధర్‌, విష్ణు ప్రసాద్‌, గోదావరిఖని వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌బాబు, రాజ్‌కు మార్‌, రామగుండం ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ, టుటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T06:21:47+05:30 IST