మూడింట రెండొంతుల మందిలో కొవిడ్ యాంటీబాడీలు: WHO

ABN , First Publish Date - 2022-06-03T03:04:33+05:30 IST

ప్రపంచంలో మూడింట రెండొంతులకుపైగా జనాభాలో కొవిడ్-19 యాంటీబాడీలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ

మూడింట రెండొంతుల మందిలో కొవిడ్ యాంటీబాడీలు: WHO

న్యూఢిల్లీ: ప్రపంచంలో మూడింట రెండొంతులకుపైగా జనాభాలో కొవిడ్-19 యాంటీబాడీలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. కరోనా టీకాలు వేయించుకోవడం వల్ల కానీ, లేదంటే వారు కరోనా బారినపడడం ద్వారా కానీ అవి వారిలో అభివృద్ధి చెంది ఉండొచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయానికి సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం.. గతేడాది ఫిబ్రవరిలో 16 శాతంగా ఉన్న సెరోప్రెవలెన్స్ రేట్ అక్టోబరు నాటికి 67 శాతానికి పెరిగింది.


ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఒమైక్రాన్ నుంచి కూడా వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తున్నట్టు పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్ఓ కోరింది. మరీ ముఖ్యంగా కరోనా సోకే ముప్పు ఎక్కువ ఉన్న సమూహాలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, ఫలితంగా పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందని పేర్కొంది.


రోగనిరోధకత మునుపటి కొవిడ్ ఇన్ఫెక్షన్ కంటే తీవ్రమైన వ్యాధి నుంచి కూడా అధిక స్థాయి రక్షణ కల్పిస్తుందని తెలిపింది. రెండు టీకా డోసులు వేయించుకున్న వారికి అత్యుత్తమ రక్షణ లభిస్తున్నట్టు అధ్యయనంలో తేలినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.  

Updated Date - 2022-06-03T03:04:33+05:30 IST