ప్రపంచాన్ని వణికిస్తున్న monkeypox...3,400కు చేరిన కేసులు

ABN , First Publish Date - 2022-06-28T17:07:03+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా 3,400 మంకీపాక్స్ కేసులను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించింది....

ప్రపంచాన్ని వణికిస్తున్న monkeypox...3,400కు చేరిన కేసులు

 ఒకరి మృతి

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా 3,400 మంకీపాక్స్ కేసులను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించింది. మంకీపాక్స్ వల్ల ఒకరు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రకటించింది. ఈ వైరస్ ఎక్కువ భాగం ఐరోపా దేశాల్లో ప్రబలింది. జూన్ 17 వతేదీ నుంచి 1,310 మంకీపాక్స్ కొత్త కేసులు నమోదయ్యాయని, 8 దేశాల్లో కొత్తగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ గత వారం మంకీపాక్స్‌ను  ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించకూడదని నిర్ణయించింది. అయినప్పటికీ మాత్రం మంకీపాక్స్ వ్యాప్తి గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. 


ఈ వైరస్ నుంచి ఎలా రక్షించుకోవాలి అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. మంకీపాక్స్ వల్ల వచ్చే దద్దుర్లు సాధారణంగా ద్రవంతో నిండిన బొబ్బలు కనిపిస్తాయి. దద్దుర్లు ఉన్నప్పుడు ప్రజలు అంటువ్యాధులకు గురవుతారని వైద్యులు చెప్పారు. 


Updated Date - 2022-06-28T17:07:03+05:30 IST